అన్నం కంటే చపాతీలే ఆరోగ్యానికి చాలా మంచివని నమ్ముతారు. ఎందుకంటే వీటిలో అన్నంలో మాదిరిగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండవు. ఈ కార్బోహైడ్రేట్లు శరీర బరువును మరింత పెంచుతాయి. అంతకాదు అన్నాన్ని తింటే బ్లడ్ షుగర్ కూడా పెరుగుతుంది. అందుకే షుగర్ పేషెంట్లు, బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా చపాతీలనే ఎక్కువగా తింటుంటారు. ఎలాంటి సమస్యలు లేనివారు కూడా రోజుకు రెండు లేదా ఒక పూట ఖచ్చితంగా గోధుమ చపాతీలను తింటుంటారు. కానీ రోజూ చపాతీలను ఎక్కువగా తినడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.