Barefoot Walking: రోజూ వాకింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్ గా, హెల్తీగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ వాకింగ్ చేయాలని చెప్తుంటారు. అయితే రెగ్యులర్ గా వాకింగ్ చేసేవారు వారినికి రెండు సార్లు చెప్పులు లేకుండా నడిచినా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.
వాకింగ్ చేయడం వల్ల బోలెడు లాభాలున్నాయి. రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే వాకింగ్ చేసేటప్పుడు సరైన షూస్ ను వేసుకోవడం అవసరం. షూస్ ధరించడం వల్ల పాదాలకు గాయాలు కావు. అలాగే కాళ్లు నొప్పులు రావు. అయితే రోజూ వాకింగ్ చేసేవారు వారంలో రెండు రోజులు షూస్ కానీ, చెప్పులు కానీ వేసుకోకుండా నడవడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
26
మానసిక ఒత్తిడి తగ్గుతుంది
చెప్పులు లేకుండా నడవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నాయి. మన అరికాళ్లలో ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని నాడీ వ్యవస్థ, ముఖ్యమైన అవయవాలతో అనుసంధానించి ఉంటాయి. కాబట్టి మనం చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఇవి నేలను తాకి ఉత్తేజితమవుతాయి. దీంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
36
మెరుగైన జీర్ణ వ్యవస్థ
మీరు చెప్పులు లేకుండా నడిచినప్పుడు జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే కాలెయం, మూత్రపిండాలు వంటి అంతర్గత అవయవాల పనితీరుకు కూడా మెరుగుపడుతుంది. మీరు చెప్పులు లేకుండా నడిచినప్పుడు రాత్రిళ్లు బాగా నిద్రకూడా పడుతుంది. మీరు రోజూ ఒక అర్థగంట పాటు చెప్పులు లేకుండా నడిస్తే శరీరం రిలాక్ అవుతుంది. దీంతో రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతారు.
తడిగా ఉంచే పచ్చికపై మీరు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మన శరీరంలోని శక్తి భూమిలోకి ప్రసరించి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్తారు. చెప్పులు లేకుండా నడిచినప్పుడు నిద్రనాణ్యత , రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
56
మడమనొప్పి తగ్గుతుంది
చాలా మందికి పాదాల వాపు, మడమ నొప్పి ఉంటాయి. ఇలాంటి వారికి చెప్పులు లేకుండా నడవడం ప్రయోజనకరంగా ఉంటుంది. చెప్పులు లేకుండా నడిచినప్పుడు అరికాళ్లలోని పాయింట్లపై ఒత్తిడి పడుతుంది. దీంతో రక్తప్రసరణ మెరుగుపడి వాపు, మడమ నొప్పి తగ్గుతుంది. అలాగే కాళ్లలోని కండరాలు, ఎముకలు బలంగా అవుతాయి.
66
ఆయుర్వేదం ప్రకారం..
ఆయుర్వేదం ప్రకారం.. ఉదయం లేదా సాయంత్రం పూట పచ్చిక బయళ్లలో నడవొచ్చు. ఈ సమయంలో నడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాలు చెప్పులు లేకుండా బయట నడిస్తే ఆరోగ్యంగా ఉంటారు.