Benefits of Cowpeas: బొబ్బర్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలామంది బొబ్బర్లను ఉడకబెట్టుకొని తింటారు. లేదా వాటితో గారెలు, దోశలు ఇతర వంటకాలు తయారు చేస్తుంటారు. అయితే వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
బొబ్బర్లలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దానివల్ల అతిగా తినడం తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు బొబ్బర్లను తరచుగా తినడం మంచిది.
25
రక్తహీనత రాకుండా..
బొబ్బర్లలో ఐరన్, ఫోలేట్, ఇతర విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతాయి. శరీరానికి ఆక్సిజన్ ను అందించే కణాల సంఖ్యను పెంచుతాయి. తద్వారా రక్తహీనతను నివారిస్తాయి. అందుకోసం బొబ్బర్లను ఉడకబెట్టుకొని లేదా.. కూర వండుకొని తినవచ్చు.
35
చర్మ ఆరోగ్యానికి..
బొబ్బర్లలోని విటమిన్ సి, ఎ, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని నివారించి.. చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి.
గర్భిణీలకు ఫోలేట్ చాలా అవసరం. ఇది బిడ్డ మెదడు, వెన్నెముక సరిగ్గా ఏర్పడడానికి సహాయపడుతుంది. బొబ్బర్లలో ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి గర్భిణులు వీటిని తినడం మంచిది. ఇవి గర్భంలో బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతాయి. అంతేకాదు బొబ్బర్లలోని కాల్షియం, మెగ్నీషియం వంటివి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.
55
షుగర్ పేషెంట్లకు..
బొబ్బర్లలోని మెగ్నీషియం.. ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించి షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇంకా శరీర అలసటను తగ్గించి.. మంచి నిద్రకు కూడా తోడ్పడుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు తరచుగా వీటిని తినడం మంచిది.