Home remedies for oily hair: చాలా మంది తమ జుట్టు మృదువుగా, చిక్కులు పడకుండా ఉండాలని కోరుకుంటారు. కానీ, కొందరి జుట్టు జిడ్డుగా ఉండి, చిక్కులు పడి ఊడిపోతూ ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టి, జుట్టును మృదువుగా మార్చుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.
డ్రై షాంపూ అనేది ఒక పొడి రూపంలో ఉండే హెయిర్‌కేర్ ఉత్పత్తి. ఇది జుట్టులోని అధిక జిడ్డును పీల్చుకుని, శుభ్రంగా, తాజాగా మార్చుతుంది. డ్రై షాంపూను జుట్టు కుదుళ్ల భాగానికి పట్టించి, వేళ్లతో మెల్లగా మసాజ్ చేయాలి. అనంతరం జుట్టును దువ్వితే జిడ్డు తగ్గి, జుట్టు క్లీన్‌గా మారుతుంది. కొన్ని సందర్భాల్లో డ్రై షాంపూ వాడిన తర్వాత బ్లో డ్రైయర్ ను కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల జట్టుకు ఫ్రెష్ లుక్ వస్తుంది. అయితే, తరచుగా వాడకూడదు. అవసరమైతే మాత్రమే వాడటం ఉత్తమం.
25
బేబీ పౌడర్
డ్రై షాంపూ లేకపోతే బేబీ పౌడర్ ఒక మంచి ప్రత్యామ్నాయం. కొద్దిగా పౌడర్‌ను చేతుల్లోకి తీసుకుని, వేళ్ల సహాయంతో జుట్టు కుదుళ్లకు మెల్లగా రాసి మసాజ్ చేయాలి. అనంతరం దువ్వడం ద్వారా జిడ్డు తగ్గి జుట్టు తాజాగా, మృదువుగా మారుతుంది. అయితే, ఎక్కువగా పౌడర్ వాడితే జుట్టు తెల్లగా మారే అవకాశం ఉండటంతో తక్కువగా వాడటం ముఖ్యం. ప్రత్యేకంగా నల్ల జుట్టు ఉన్నవారు మరింత జాగ్రత్తగా వాడాలి. పౌడర్ మిగిలిపోవద్దంటే తడిబట్టతో జుట్టును తుడవడం మంచిది. అలాగే, పౌడర్‌ను నేరుగా తలపై పోయకుండా చేతుల్లో వేసుకుని వేళ్లతో జుట్టులో రాయడం ఉత్తమ పద్ధతి.
35
జుట్టు జిడ్డును వెంటనే తగ్గించే తేలికైన చిట్కా
జుట్టులో జిడ్డును తొలగించడానికి టిష్యూ పేపర్ లేదా బ్లాటింగ్ పేపర్ ఓ చక్కటి పరిష్కారం. జుట్టు కుదుళ్లు, జిడ్డు ఉన్న ప్రాంతాలపై పేపర్‌తో మెల్లగా ఒత్తాలి. ఇది జిడ్డును పీల్చుకుని తాత్కాలికంగా జుట్టును తాజాగా మార్చుతుంది. ప్రత్యేకించి అత్యవసర పరిస్థితుల్లో, బయట ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరం. ముఖ్యంగా జుట్టు పైభాగంలోని జిడ్డును తొలగించేందుకు ఇది మంచి పద్ధతి.
జుట్టులో జిడ్డు ఎక్కువగా ఉంటే, స్టైలిష్‌గా ముడివేయడం మంచి పరిష్కారం. పోనీటైల్, ఫ్రెంచ్ జడ వంటి హెయిర్ స్టైల్స్ జుట్టు కుదుళ్లలోని జిడ్డును దాచగలవు. హెయిర్ బ్యాండ్లు, క్లిప్పులు వాడడం వల్ల జుట్టు మరింత చక్కగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మెడ ఎముక పైన జుట్టును ముడి వేయడం ద్వారా కింది భాగాన్ని దాచడం కూడా సాధ్యమవుతుంది.
55
హెయిర్ స్ప్రే
హెయిర్ స్ప్రేలు జుట్టుకు తక్షణ ఫ్రెష్ లుక్ అందించే ఉత్తమ పరిష్కారం. తేలికపాటి హెయిర్ స్ప్రేను జుట్టు కుదుళ్లకు కొద్దిగా పిచికారీ చేసి, వేళ్లతో సర్దుకుంటే జిడ్డు తగ్గినట్లు కనిపిస్తుంది. స్ప్రే జుట్టుపై ఒక పలుచని పొరలా ఏర్పడి జిడ్డును దాచుతుంది. టెక్స్చరైజింగ్ స్ప్రేలు అయితే పౌడర్ లాంటి ఫినిష్ ఇస్తూ జిడ్డును పీల్చుకుంటాయి. అయితే అధికంగా వాడితే జుట్టు గట్టిపడే అవకాశం ఉన్నందున, తక్కువ మోతాదులో మాత్రమే వాడండి.