Chicken Skin: చికెన్‌ను స్కిన్‌తో తినడం మంచిదా ? కాదా?

Published : Jul 08, 2025, 07:13 AM IST

Chicken With Skin: ఇటీవల చాలామంది చికెన్ ను స్కిన్ లేకుండా తింటున్నారు. చికెన్ ను స్కిన్‌తో తిన‌కూడ‌ద‌ని, మంచిది కాద‌ని కొంద‌రు భావిస్తుంటారు. చికెన్ ను స్కిన్‌తో తిన‌కూడ‌దా? చికెన్‌ను స్కిన్‌తో స‌హా తింటే ఏమ‌వుతుంది ? అనే విషయాలు తెలుసుకుందాం

PREV
16
చికెన్

చికెన్ .. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే మాంసాహార వంటకం. మాంసాహార ప్రియుల్లో చాలా మంది కోడి మాంసాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. వారాలు, రోజులు అనే తేడా లేకుండా అవకాశం దొరికినప్పుడల్లా చికెన్ ను రుచిగా వండుకొని తింటారు.

26
కోడి మాంసం :

చికెన్‌లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో, కండరాల పెరుగుదల, ఇమ్యూనిటీ బలోపేతానికి ఎంతో ఉపయోగకరం. మటన్ కంటే చికెన్ తక్కువ ధరలో లభించడంతో చాలామంది మాంసాహార ప్రియులు చికెన్ ను ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాక, చికెన్‌లో కొవ్వు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికీ ఇది బెస్ట్ ఆప్షన్.

36
కోడి తోలు :

చాలామంది చికెన్‌ను తోలుతో సహా తినడం ఇష్టపడతారు. చికెన్ తోలు (బయటి పొర) తినేందుకు రుచిగా ఉంటుంది. అయితే.. చికెన్ స్కిన్ గురించి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిలో ఉన్న కొవ్వు శరీరానికి అవసరమని అంటారు, మరికొందరు అధిక కొవ్వు కారణంగా ఇది ఆరోగ్యానికి హానికరం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. నిజానికి, చికెన్ తోలులో సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల అధికంగా తినడం హాని కలిగించవచ్చు.

46
చికెన్‌ను తోలుతో తినొచ్చా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చికెన్‌ను తోలుతో సహా తినడం ఆరోగ్యానికి హానికరం. కోడి తోలును తాజాగా ఉంచేందుకు కొన్నిసార్లు రసాయనాలు వాడతారు, ఇది ఆరోగ్యానికి ముప్పుగా మారొచ్చు. అంతేకాక, ఈ తోలులో సాచ్యురేటెడ్ ఫ్యాట్, అధిక కేలరీలు ఉంటాయి. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు ఉన్నవారు దీన్ని తినకూడదని హెచ్చరిస్తున్నారు. అయితే, కోడి తోలులో ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు కొంతమేర ఉంటాయి. అందుకే 15 రోజులకు ఒకసారి, పరిమిత మొత్తంలో మాత్రమే తోలుతో చికెన్ తినవచ్చు. కానీ తరచూ తినడం ప్రమాదకరం కావొచ్చు. 

56
ఫామ్ కోడి :

ఫామ్‌లో పెంచిన కోడిలో హార్మోన్లు, రసాయనాల మోతాదు ఎక్కువగా ఉండే అవకాశముంది, అలాంటి కోళ్లను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అలా తినాలనుకుంటే తోలు తీసేసిన చికెన్ ను మాత్రమే తినాలని చెబుతున్నారు. 

66
ఏ భాగాన్ని తినాలి?

చికెన్ తినాలనుకుంటే కోడి చెస్ట్ భాగాన్ని తినండి. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉండి, కొవ్వు తక్కువగా ఉండటంతో బరువు తగ్గే వారికీ, కండరాల పెంపకానికి ఇది ఎంతో ప్రయోజనకరం. అలాగే.. కోడి తొడ భాగాన్ని కూడా తినవచ్చు. ఇందులో కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ వాటిని వేయించకుండా కూరగా చేసుకుని తినవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories