Weight Loss: బరువు తగ్గడంపై ఆల్కహాల్ ప్రభావం చూపుతుందా?

Published : Jul 07, 2025, 08:22 PM IST

Weight Loss : ఈ మధ్యకాలంలో చాలామంది  అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి వ్యాయామం, డైట్ లో మార్పులు చేస్తుంటారు. అయితే.. బరువు తగ్గడంపై ఆల్కహాల్‌ ప్రభావం చూపుతుందా?  అనే విషయాలేంటీ?

PREV
18
ఆల్కహాల్ బరువు తగ్గడంపై ప్రభావం

ఆధునిక జీవన శైలి, సమయపాలన లేని ఆహార పద్దతుల వల్ల చాలామంది విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకొని బాధపడుతున్నారు. తర్వాత బరువు  తగ్గాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయాణంలో కొందరూ  కొన్నిరకాల పానీయాలను తీసుకుంటారు. ఈ క్రమంలో కొంతమంది ఆల్కహాల్‌ ను కూడా తీసుకుంటారు. 

ఆల్కహాల్ కేవలం పానీయమే కదా అని భావిస్తే పొరపాటు పడినట్లే.. ఇది పలు రకాలుగా బరువు తగ్గే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది శరీర హార్మోన్లపై ప్రభావం చేయడమే కాకుండా ఆహారంపై నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. ఆల్కహాల్ మీ బరువు తగ్గించే ప్రయత్నాలను ఎలా ప్రభావితం చేస్తుందో? వాటి గురించి తెలుసుకుందాం. 

28
ఆల్కహాల్‌లో పోషకాలు?

ఆల్కహాల్‌లో ఎలాంటి పోషక విలువలు ఉండవు. కేవలం క్యాలరీలు మాత్రం ఉంటాయి. ఉదాహరణకు, ఒక షాట్ వోడ్కా లేదా ఒక గ్లాసు వైన్‌లో 100 కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి. దీనిలో చక్కెర మిశ్రమాలు కలిపి తాగితే.. శరీరానికి అవసరం లేని అదనపు కేలరీలు చేరి, బరువు పెరగడానికి దారితీస్తాయి.

38
కొవ్వు తగ్గుదల

ఆల్కహాల్ ను శరీరం విషపదార్థంగా పరిగణిస్తుంది. అందువల్ల కాలేయం దాన్ని తొలగించడానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఈ సమయంలో కొవ్వు విచ్ఛిన్నం అయ్యే ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోతుంది. దీని ప్రభావంగా, శరీరం కొవ్వును నిల్వ అవుతుంది. తద్వారా , బరువు పెరుగుతారు. 

48
హార్మోన్ల అసమతుల్యత

ఆల్కహాల్ తాగడం వల్ల ఇన్సులిన్, లెప్టిన్, కార్టిసాల్ వంటి కీలక హార్మోన్ల స్థాయిలు మారతాయి. ఇది అదనపు కొవ్వు నిల్వ, రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు,  తినాలనే కోరికలు ఎక్కువ కావడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ మార్పులు కాలక్రమేణా బరువు తగ్గే ప్రయత్నాలను నిరాశకరంగా మార్చేస్తాయి, మీరు ఎంత వ్యాయామం చేసినా లేదా ఆహారం జాగ్రత్తగా తీసుకున్నా ఫలితం తక్కువగా ఉంటుంది.

58
నిద్రపై ప్రభావితం

ఆల్కహాల్ తాగిన తర్వాత మత్తుగా ఉన్నప్పటికీ,  అది గాఢ నిద్రను భంగం చేస్తుంది. దీని వల్ల శరీర రిపేర్‌ ప్రక్రియలు దెబ్బతింటాయి. గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ స్థాయి పెరగడంతో, మరుసటి రోజు అధిక ఆకలి, చిరుతిళ్లపై నియంత్రణ కోల్పోవడం వంటివి ప్రభావితం చేస్తుంది. ఈ అంశాలు  బరువు పెరగడానికి ప్రత్యక్ష కారణాలుగా మారుతాయి.

68
ఆకలి నియంత్రణపై ప్రభావం

ఆల్కహాల్ మీ మెదడులోని తీర్పు, నియంత్రణ, ప్రేరణకు బాధ్యత వహించే భాగాలపై ప్రభావం చూపిస్తుంది. దీని వలన మీరు నియమిత ఆహారాన్ని పక్కనపెట్టి, ఫాస్ట్ ఫుడ్ లేదా అర్ధరాత్రి చిరుతిళ్లు వైపు వెళ్లే అవకాశం పెరుగుతుంది. ఇది బరువు తగ్గే ప్రయాణానికి ఒక పెద్ద ఆటంకంగా మారుతుంది.

78
డీహైడ్రేట్

ఆల్కహాల్ మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది, కండరాల నొప్పిని పెంచుతుంది.  ప్రోటీన్ సంశ్లేషణను నెమ్మదింపజేస్తుంది. దీని ఫలితంగా శరీరం కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కండరాల పెరుగుదల తగ్గుతుంది. కేలరీల బర్న్ సమర్థత కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ కలిపి, మీ శరీరం కొవ్వు కరిగించే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.  ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవాలనుకునే వారికి ఇది పెద్ద అడ్డంకిగా మారుతుంది.

88
భావోద్వేగాలతో అనుసంధానం

కొంతమందికి ఆల్కహాల్ తాగడం అనేది ఎంజాయ్ మెంట్ గా మారింది. పండుగలు, వేడుకలు  లేదా ఒత్తిడి వంటి భావోద్వేగాలకు అనుసంధానంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో అసాధారణంగా  లేక అధికంగా తినడం లేదా అనవసరంగా చిరుతిళ్లు తింటుంటారు. ఇలాంటి పరిస్థితి మీ ఆహార నియమాలను ప్రభావితం చేస్తుంది. అందుకే, బరువు తగ్గే ప్రయాణంలో ఇలాంటి పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories