Immunity: వర్షాకాలంలో తేమ వాతావరణం, వర్షపు నీరు కారణంగా ప్రజలు తరచూ ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఈ వ్యాధులకు చెక్ పెట్టాలంటే.. మనలో రోగనిరోధక శక్తిని బలపరిచే ఆహారాన్ని తీసుకోవాలి. మనలో రోగ నిరోధక శక్తి పెంచే సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుందాం.
వర్షాకాలంలో ప్రజలు తరచూగా ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా జలుబు, జ్వరం, ఇతర అంటు వ్యాధులు వస్తాయి. ఆ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. మెరుగైన రోగనిరోధక శక్తి అవసరం. వర్షాకాలంలో రోగనిరోధకశక్తి పెంపొందించుకోవాలంటే కొన్ని రకాల పండ్లు తినాలని నిపుణులు అంటున్నారు. మరి ఏయే పండ్లు తినాలని సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
26
జామ
జామ పేదవాడి ఆపిల్. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్ అధికంగా ఉంటాయి. షుగర్ పేషంట్స్ కు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే..ఇన్ఫెక్షన్ రాకుండా సహాయపడుతుంది.
36
బేరి పండు
బేరి పండులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. జలుబు, ఫ్లూ లక్షణాలతో పోరాడటంలో సహాయపడుతుంది. బేరి పండ్లలో ఉండే ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఆరెంజ్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి, తద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం అవుతుంది. ఆరెంజ్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్‌లో ఆరెంజ్ ను చేర్చుకోండి.
56
బొప్పాయి
విటమిన్ సి అధికంగా ఉండే బొప్పాయి తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరుచుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇందులో పాపైన్ వంటి జీర్ణ ఎంజైమ్‌లు కూడా ఉన్నాయి, ఇవి వాపును తగ్గిస్తాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి.
66
దానిమ్మ పండు
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన దానిమ్మ పండ్లు బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడతాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. దానిమ్మ పండ్లలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.