Kidneys Health: రోజూ ఈ పదార్థాలు తింటే కిడ్నీ ఫెయిల్యూర్ పక్కా!

Published : Jun 17, 2025, 02:02 PM IST

Kidneys Health: శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేయడమే కాకుండా వ్యర్థాలను తొలగించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
17
ప్రమాదంలో పడేసే ఆహారపదార్థాలు

మనం ప్రతిరోజూ తినే ఆహారాపదార్థాలు మన ఆరోగ్యంపై  ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మూత్రపిండాల (కిడ్నీ)పై పడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యం ప్రమాదంలో పడేసే ఆ ఆహారాపదార్థాలు ఏమిటో తెలుసుకుందాం..

27
ఉప్పు

ఎక్కువ ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది మూత్రపిండాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటు మూత్రపిండాల వడపోత సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం మానుకోండి. మీ ఆహారంలో తక్కువ ఉప్పు వేసి, దానికి బదులుగా నిమ్మరసం వాడండి.

37
నొప్పి నివారణ మాత్రలు

నొప్పి నివారణ మాత్రలను తరచుగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. క్రమంగా దాని పనితీరును తగ్గిస్తుంది. నొప్పి నివారణ మాత్రలను అలవాటు చేసుకోకండి. యోగా లేదా ఆయుర్వేద చికిత్స వంటి నొప్పికి ప్రత్యామ్నాయ పరిష్కారాలను అవలంబించండి.

47
చక్కెర

చక్కెర మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. మధుమేహం మూత్రపిండ వైఫల్యానికి ప్రధాన కారణాలలో ఒకటి. శీతల పానీయాలు, స్వీట్లు, బేకరీ ఉత్పత్తులకు దూరంగా ఉండండి.

57
ప్రాసెస్ చేసిన ఆహారం

ప్రాసెస్ చేసిన ఆహారాలలో అధిక మొత్తంలో ఉప్పు, రసాయనాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాలపై అధిక భారం పెడుతుంది. కాబట్టి తాజా ఇంట్లో వండిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. బయట ఫుడ్ తినకండి.  

67
రెడ్ మీట్

రెడ్ మీట్ లో ప్రోటీన్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల  మూత్రపిండాలపై ఒత్తిడిని పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడానికి కారణం కావచ్చు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే రెడ్ మీట్ తినండి. మీట్ కు బదులుగా పప్పులు, గుడ్లు లేదా చికెన్ వంటి తేలికపాటి ప్రోటీన్ తినండి. 

77
జంక్ ఫుడ్

వీటిలో అధిక సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, తక్కువ పోషకాలు ఉంటాయి, ఇవి ఊబకాయం, అధిక రక్తపోటుకు దారితీస్తాయి. వీటి వల్ల మూత్రపిండాల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. దానికి బదులుగా ఇంట్లో తయారుచేసిన ఆహారం లేదా పండ్లు, కూరగాయలు తినడం మేలు. 

Read more Photos on
click me!

Recommended Stories