Health Tips: నేరేడు గింజలతో అటు షుగర్‌ ,ఇటు బరువుని ఒకేసారి ఫసక్‌ చేసేద్దామా!

Published : Jul 01, 2025, 03:19 PM ISTUpdated : Jul 01, 2025, 06:22 PM IST

మధుమేహం నియంత్రణకు, బరువు తగ్గేందుకు, చర్మ కాంతికి ఉపయోగపడే నేరేడు గింజల పొడి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు.

PREV
18
నేరేడు

ఎండాకాలం వచ్చినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చే సీజనల్ పండ్లలో నేరేడు (Jamun) ఓ ప్రత్యేక స్థానం దక్కించుకుంది. కానీ అందులోని గింజలను చాలామంది వ్యర్థంగా విసిరేస్తారు. నిజానికి, వాటిలో దాగి ఉన్న ఔషధ గుణాలు ఎంతో అద్భుతమైనవి. ఆయుర్వేదం ప్రకారం నేరేడు గింజలతో తయారయ్యే పొడి అనేక ఆరోగ్య సమస్యలకు సహజ పరిష్కారంగా నిలుస్తోంది.

28
మధుమేహ నియంత్రణలో సహాయకం

 నేరేడు గింజల్లో జంబోలిన్, జంబోసిన్ అనే సహజ రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ శోషణను నియంత్రించి, షుగర్ లెవెల్ స్టేబుల్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతి ఉదయం ఒక చెంచా పొడిని గోరువెచ్చటి నీటిలో కలిపి తాగితే మధుమేహ నియంత్రణకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

38
బరువు తగ్గే ప్రయత్నంలో తోడుగా

ఈ గింజల పొడిలో ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. కడుపు త్వరగా నిండిన ఫీల్‌ రావడం వల్ల అధికంగా తినాలనే అలవాటు తగ్గుతుంది. దీంతో బరువు తగ్గే ప్రయాణంలో ఇది సహాయపడుతుంది.

48
చర్మ సౌందర్యానికి సహజ రహస్యం

 నేరేడు గింజల పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి, చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి. మొటిమలు, మచ్చలు తగ్గించడంలో, ముఖం ప్రకాశవంతంగా మారడంలో ఇది సహాయకారి.

58
రోగనిరోధక శక్తి పెంపునకు తోడ్పాటు

 ఈ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణనందిస్తాయి. ముఖ్యంగా వైరల్ సీజన్లో ఇది రక్షణ కవచంగా పనిచేస్తుంది.

68
ఇంట్లోనే నేరేడు గింజల పొడి తయారీ విధానం

నేరేడు పండ్ల నుంచి గింజలను వేరు చేసి శుభ్రంగా కడగాలి.

ఐదు నుంచి ఏడురోజులపాటు ఎండలో బాగా ఆరబెట్టాలి.

ఆరిన గింజలను చిన్న మంటపై హల్కాగా వేయించాలి.

చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడిచేయాలి.

గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి.

78
ఉపయోగించే విధానం

 ప్రతి రోజు ఉదయం 1 టీ స్పూన్‌ పొడిని గోరువెచ్చటి నీటిలో కలిపి తాగాలి.

మజ్జిగలో కలిపి వేసవిలో తీసుకుంటే శరీర వేడిని తగ్గిస్తుంది.

ఇతర హర్భల్ పదార్థాలతో మిక్స్‌ చేసి కషాయం లేదా చాయ్‌ రూపంలో తీసుకోవచ్చు.

88
జాగ్రత్తలు

 మోతాదుకు మించి వాడరాదు.

ఔషధంగా వాడాలంటే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories