Egg Shells: గుడ్డు పెంకులు పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇకపై ఆ పని చేయలేరు..

Published : Jul 01, 2025, 01:55 PM IST

Egg Shells: ఉడకబెట్టిన గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే.. చాలామంది ఆ గుడ్డును తిని,  గుడ్డు పెంకులను పడేస్తుంటారు. ఇలా వ్యర్థంగా పారవేసే గుడ్డు పెంకులతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయట. ఆ ప్రయోజనాలేంటో ఓ లూక్కేయండి.  

PREV
14
గుడ్డు పెంకులు - ఉపయోగాలు

రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. కానీ, వృథాగా పడేసే గుడ్డు పెంకులతో ఎన్నో ఆశ్చర్యపరిచే ప్రయోజనాలున్నాయంట. ఈ పెంకుల్లో కాల్షియం, ఖనిజాలు అధికంగా ఉంటాయి.  ప్రోటీన్ పౌడర్ల తయారీలో ఈ పెంకులను వాడుతారట.  అలాగే.. ఈ పెంకులను ఎరువుగా కూడా వాడుతారట. అంతే కాకుండా ఫేస్ స్క్రబ్ లేదా క్లీనింగ్ పౌడర్‌గా ఉపయోగిస్తారంట.

24
వెలకట్టని ఔషధం!

గుడ్డు పెంకుల ఉపయోగాలు:  

  • గుడ్డు తిన్న తర్వాత పెంకులను ఎప్పుడూ పడేసేస్తాం. కానీ ఈ గుడ్డు పెంకులు శుభ్రత పనుల నుంచి ఆరోగ్య రక్షణ వరకు ఎన్నో విధాలుగా  ఉపయోగపడతాయన్న సంగతి తెలుసా?
  • గుడ్డు పెంకులను పొడి చేసి కుక్కర్, పాత్రల మరకలు తొలగించేందుకు ఉపయోగించవచ్చు.
  • కాఫీ ఫిల్టర్‌ను శుభ్రం చేయడానికి లేదా సింక్‌లోని అడ్డంకులను తొలగించేందుకు పెంకుల పొడిలో వెనిగర్ కలిపి వాడొచ్చు.
  • కాల్షియం అధికంగా ఉండే గుడ్డు పెంకుల పొడిని సూప్, సాస్‌లలో కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు, పళ్ళు బలంగా మారతాయి.
  • చెత్తగా కనిపించినా, గుడ్డు పెంకులు అనేకంగా ఉపయోగపడతాయి. 
34
మృదువైన చర్మం కోసం

మృదువైన చర్మం కోసం: గుడ్డు పెంకుల పొడిని ఫేస్ మాస్క్‌గా వాడితే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. తేనె, పెరుగు కలిపి వేసుకుంటే పిగ్మెంటేషన్ తగ్గుతుంది, దురద వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. 

మొక్కలకు ఎరువుగా : ఈ పెంకుల పొడిని మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. అందులోని కాల్షియం మొక్కల వృద్ధిని వేగవంతం చేస్తుంది. మొక్కల వేర్ల దగ్గర చల్లితే మంచి ఫలితం ఉంటుంది.

44
సహజ పురుగుమందుగా..

సహజ పురుగుమందుగా : గుడ్డు పెంకులను సహజ పురుగుమందుగా కూడా ఉపయోగించవచ్చు. బాగా పొడిగా చేసి మొక్కల ఆకులపై చల్లితే పురుగులు దరిచేరవు. మొక్కల చుట్టూ పెంకుల పొడి చల్లి ఉంచితే పురుగుల నివారణతో పాటు  మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

ముఖ్య గమనిక: గుడ్డు పెంకులను వాడే ముందు నీటితో శుభ్రంగా కడిగి, ఎండలో బాగా ఆరబెట్టి, ఆపై పొడి చేయాలి. ముఖ్యంగా తినే విధంగా వాడాలనుకుంటే వైద్యుల సలహా తప్పనిసరి. 

Read more Photos on
click me!

Recommended Stories