Nighttime Thirst : అర్ధ రాత్రిళ్లు గొంతు ఎండిపోవడం, విపరీతంగా దాహం వేయడం వలన నిద్రభంగం వాటిల్లుతుంది. అయితే.. ఇది చిన్న సమస్యే అని భావిస్తే తప్పే. ఈ సమస్య కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు. ఆ వ్యాధులేంటీ? సమస్య నివారణ మార్గాలేంటో తెలుసుకోండి.
చాలా మందికి రాత్రిళ్లు నిద్రలో దాహం వేస్తుంది. అయితే.. ఇదొక సాధారణ సమస్యలా అనిపించవచ్చు, కానీ, ఇది కొన్నిసార్లు ఆరోగ్య సమస్యల సంకేతం కావచ్చు. తరచుగా అర్థరాత్రి లేచి నీళ్లు తాగాలనిపిస్తే, అది డయాబెటిస్, డయాబెటిస్ ఇన్సిపిడస్, లేదా కిడ్నీ సంబంధిత సమస్యలకు సూచన కావచ్చు. ఈ అలవాటు నిరంతరంగా కొనసాగితే, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
25
డయాబెటిస్ :
రాత్రిళ్లు దాహం వేయడం డయాబెటిస్‌కి సంకేతం కావచ్చు. టైప్ 2 డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు శరీరం అదనపు గ్లూకోజ్‌ను మూత్రంతో బయటకు పంపుతుంది. దీని వల్ల తరచూ మూత్రవిసర్జన, డీహైడ్రేషన్, దాహం వంటి సమస్యలు వస్తాయి. ఇది డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే వ్యాధికీ సంకేతం కావచ్చు. ఈ వ్యాధి యాంటీడియురెటిక్ హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది. దీనివల్ల ఎక్కువ దాహం, అధిక మూత్రవిసర్జన జరుగుతుంది.
35
కిడ్నీ సమస్య :
దీర్ఘకాలిక కిడ్నీ సమస్య వల్ల శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా రాత్రిళ్లు తరచుగా దాహం వేయడం, మూత్రవిసర్జన చేస్తారు. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కిడ్నీ పరీక్ష చేయించుకోవడం మంచిది. త్వరితంగా కారణం గుర్తించి, సరైన చికిత్స తీసుకోవచ్చు.