Heart Attack: మెషీన్‌ కాఫీ తాగితే గుండెపోటు వస్తుందా? నిజం ఇదిగో

Published : Apr 11, 2025, 09:03 PM IST

Heart Attack: చాలా వరకు ఆఫీసుల్లో కాఫీ మెషీన్‌లే ఉంటాయి. దీంతో అందరూ ఆ కాఫీలే తాగుతారు. అయితే మెషీన్ కాఫీ తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
Heart Attack: మెషీన్‌ కాఫీ తాగితే గుండెపోటు వస్తుందా? నిజం ఇదిగో

ఇప్పుడు ప్రతి ఆఫీసులో కాఫీ మెషీన్ ఉండటం చాలా సాధారణం అయిపోయింది. కాఫీ తాగడం వల్ల మనస్సు ఉత్తేజంగా ఉంటుంది. శరీరానికి వెంటనే శక్తిని కూడా ఇస్తుంది. ఆఫీసు కాఫీ మెషీన్ నుండి బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ ఇలా రకరకాల కాఫీలు తాగడానికి అవకాశం ఉంటుంది. కానీ రోజుకు ఎక్కువ సార్లు కాఫీ తాగితే అది ఆరోగ్యానికి ప్రమాదకరమని డాక్టర్లు చెబుతారు. మరి మెషీన్ కాఫీ తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

25

నిజమే.. మెషీన్ కాఫీ గుండెను ప్రభావితం చేస్తుంది?

ఇటీవల వెలువడిన ఒక అధ్యయనంలో ఒక షాకింగ్ విషయం వెల్లడైంది. ఇంట్లో తయారు చేసుకునే కాఫీ కంటే ఆఫీసులో ఉండే మెషీన్ కాఫీలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే ప్రమాదకరమైన సమ్మేళనాలు ఉన్నాయని కొత్త అధ్యయనంలో కనుగొన్నారు. కాబట్టి మెషిన్ కాఫీని ఎక్కువగా తాగితే శరీరంలో కొవ్వు శాతం పెరిగి గుండె ఆరోగ్యంలో సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి టూత్ బ్రష్ నిండా పేస్ట్ వేసుకొని పళ్లు తోముతున్నారా? ఎంత డేంజరో తెలుసా?

35

14 ఆఫీసుల్లో అధ్యయనం

ఈ విషయం గురించి ఓ కంపెనీకి చెందిన కొందరు పరిశోధకులు 14 ఆఫీసుల్లోని మెషీన్ కాఫీ నమూనాలను విశ్లేషించారు. దానిని ఇంటి కాఫీతో పోల్చినప్పుడు ఆఫీస్ మెషీన్ కాఫీలో ఎక్కువ మొత్తంలో కెఫెస్టాల్, కహ్వీయోల్ ఉన్నట్లు కనుగొన్నారు. ఇది శరీరంలో ఎక్కువ కొవ్వు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే కారకమని పరిశోధకులు చెబుతున్నారు. 

మెషీన్ కాఫీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ కాఫీలు తాగితే మీకు తెలియకుండానే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని అధ్యయనం చెబుతోంది. 

45

ఎసిడిటీ సమస్య పెరుగుతుంది

ఆఫీస్ మెషీన్ కాఫీ మిమ్మల్ని చురుకుగా, అప్రమత్తంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ మీరు దానిని ఎక్కువగా తాగితే ఆందోళన, నరాల సమస్యలు వస్తాయి.

షుగర్ వ్యాధి, బరువు పెరగడం

కొన్నిసార్లు మెషీన్ కాఫీలో చక్కెర, సిరప్‌లు కలుపుతారు. కాబట్టి మీరు దీన్ని ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కాఫీ తాగితే గుండెల్లో మంట, ఎసిడిటీ వస్తుంది.

55

కాఫీ వల్ల ఉపయోగాలు

కాఫీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. యూరోపియన్ ప్రివెంటివ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో రోజుకు రెండు నుండి మూడు కప్పుల కాఫీ తాగేవారికి కాఫీ తాగని వారి కంటే గుండె జబ్బులు, ప్రారంభ మరణాల ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు.

ఇది కూడా చదవండి  ఈ అలవాట్లు మార్చుకోకపోతే మీ మెదడుకు చాలా డేంజర్ 

Read more Photos on
click me!

Recommended Stories