Rice Water: బియ్యం నీటిలో వీటిని కలిపి బట్టతలపై రాస్తే జుట్టు రావడం పక్కా..!

Published : Apr 11, 2025, 04:30 PM IST

జుట్టు గురించి ఆరాటపడని వారు ఎవరుంటారు చెప్పండి. నల్లని, ఒత్తైన జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగా రకరకాల ప్రాడక్టులు వాడుతుంటారు. మరీ ముఖ్యంగా బట్టతల ఉన్నవారు. జుట్టు పెరగాలన్న ఆశతో మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కొత్త హేయిర్ ప్రాడక్ట్ వాడుతుంటారు. దీనివల్ల లాభం జరగకపోగా.. కొన్ని సార్లు ఉన్న జుట్టు కూడా రాలిపోయే ప్రమాదం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిలో సహజ పద్ధతుల ద్వారా జుట్టును ఎలా పెంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
14
Rice Water: బియ్యం నీటిలో వీటిని కలిపి బట్టతలపై రాస్తే జుట్టు రావడం పక్కా..!

ప్రస్తుతం చాలామంది జుట్టు రాలడం, తెగడం, విరిగిపోవడం, తెల్లబడటం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఒత్తైన, నల్లని జుట్టు కోసం ఇంట్లో దొరికే సహజ పదార్థాలు వాడటం మంచిది అంటారు నిపుణులు. వాటిలో ప్రధానమైంది రైస్ వాటర్. జుట్టు ఆరోగ్యానికి బియ్యం నీరు ఎంతగా ఉపయోగపడుతుందో అందరికీ తెలుసు. బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడానికి శక్తివంతంగా పనిచేస్తాయి. మరీ ముఖ్యంగా బట్టతల సమస్యను పరిష్కరించుకోవడానికి, చర్మానికి పోషణ ఇవ్వడానికి బియ్యం నీటిని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

24
బియ్యం నీటితో ఇలా చేయండి!

ఒక కప్పు బియ్యాన్ని 2–3 కప్పుల నీటిలో 30 నిమిషాలు నానబెట్టి బియ్యం నీటిని తయారు చేయండి. నీటిని వడగట్టి స్ప్రే బాటిల్‌లో నిల్వ చేయండి. బట్టతల ఉన్న చోట నేరుగా స్ప్రే చేయండి. మెరుగైన  రక్త ప్రసరణ కోసం 5 నుంచి 10 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి. బియ్యం నీటిలోని అమైనో ఆమ్లాలు, ఇనోసిటాల్ జుట్టు కుదుళ్లకు పోషణనిస్తాయి. వేర్లను బలోపేతం చేస్తాయి. తిరిగి జుట్టు పెరిగేలా చేస్తాయి.

 

34
పులియబెట్టిన బియ్యం నీటితో..

బియ్యాన్ని పుల్లని వాసన వచ్చే వరకు నానబెట్టండి. 24 నుంచి 48 గంటల వరకు గది ఉష్ణోగ్రత వద్ద పులియబెట్టండి. పులియబెట్టిన బియ్యం నీటిని తలపై చర్మానికి పట్టించండి. బట్టతల ఉన్నచోట మంచిగా పట్టించండి. 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి. పులియబెట్టడం వల్ల బియ్యం నీటిలోని పోషకాలు పెరుగుతాయి. ఇది దెబ్బతిన్న జుట్టును బాగు చేయడానికి, నిద్రాణమైన కుదుళ్లను ఉత్తేజపరచడానికి మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

44
సహజ బూస్టర్‌లతో బియ్యం నీరు

బియ్యం నీటిలో కలబంద గుజ్జు, రోజ్మేరీ నూనె లేదా పిప్పరమెంట్ నూనె వంటి సహజ పదార్థాలను కలపండి. ఈ మిశ్రమాన్ని బట్టతల ఉన్న చోట పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత కడిగేయండి. ఇందులోని బూస్టర్‌లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మంటను తగ్గించడానికి, జుట్టు తిరిగి పెరగడానికి శక్తివంతంగా పనిచేస్తాయి.

 

Read more Photos on
click me!

Recommended Stories