మనలో చాలామందికి ఉదయాన్నే బ్రెడ్ తినే అలవాటు ఉంటుంది. బ్రెడ్ తో చేసే వెరైటీస్ కి చాలా తక్కువ టైం పడుతుంది. త్వరగా తినేయవచ్చు. కాబట్టి చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ ని తింటుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.
ప్రస్తుత బిజీ లైఫ్ లో ఏదైనా త్వరగా అయిపోవాలి. త్వరగా చేసేయాలి అనే ధోరణి బాగా పెరిగిపోయింది. ఫుడ్ విషయంలోనూ అంతే. అందుకే చాలామంది ఉదయం అల్పాహారంగా ఏం తింటున్నామో కూడా పట్టించుకోరు. ముఖ్యంగా ఉదయాన్నే బ్రెడ్ తినడాన్ని చాలామంది ఇష్టపడతారు. డైట్‌లో ఉన్నవాళ్లు కూడా లైట్ బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ తింటుంటారు. కానీ ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున బ్రెడ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. అసలు ఉదయాన్నే బ్రెడ్ ఎందుకు తినకూడదో.. తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
25
రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి:
ఉదయాన్నే పరగడుపున బ్రెడ్ తినడం అంత మంచిది కాదు. ముఖ్యంగా వైట్ బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. బ్రెడ్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
35
మలబద్ధకం:
బ్రెడ్‌లో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల పేగు కదలికలు ప్రభావితమై కడుపునొప్పి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే ఉదయాన్నే పరగడుపున బ్రెడ్ తినడం పూర్తిగా మానేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బ్రెడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండటం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది. ఇది అతిగా తినడానికి దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. అలాగే వైట్ బ్రెడ్‌లో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల పరగడుపున తింటే కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి.
55
బ్రెడ్ కి బదులు ఏం తినవచ్చు?
నిపుణుల ప్రకారం.. ఉదయం అల్పాహారంగా బ్రెడ్‌కు బదులు ఓట్స్, గుడ్లు, పండ్లు, కూరగాయలు తినవచ్చు. వీటిలో ఉండే ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి ఉదయం పూట పోషకాలతో కూడిన ఫుడ్ తీసుకోవడం మంచిది.