Hair Growth: జుట్టు రాలడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. దీంతో రకరకాల ప్రయాత్నాలు చేస్తుంటారు. అయితే ఆవ నూనెతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఈ నూనెను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతిలో ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఆవ నూనెలో మెంతి గింజలు వేసి మరిగించి తలకు పట్టిస్తే, తల చర్మానికి పోషణ లభిస్తుంది. ఇది జుట్టు మూలాలను బలపరచి రాలిపోవడం తగ్గిస్తుంది.
26
ఆవ నూనె + కరివేపాకు
కరివేపాకులో విటమిన్ B, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అకాలంలో జుట్టు తెల్లబడకుండా కాపాడతాయి. ఆవ నూనెలో కరివేపాకు వేసి వేడి చేసి తలకు రాసుకుంటే సహజంగా జుట్టు పెరుగుదల మెరుగవుతుంది.
36
ఆవ నూనె + ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త జుట్టు పెరగడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఉల్లిపాయ రసాన్ని ఆవ నూనెతో కలిపి మసాజ్ చేస్తే, కొత్త జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.