Diabetes: స‌గం మందికి డ‌యాబెటిస్ ఉంద‌న్న విష‌యం కూడా తెలియదంటా. అధ్య‌య‌నంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు

Published : Sep 18, 2025, 08:58 AM IST

Diabetes: ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోన్న వ్యాధుల్లో డ‌యాబెటిస్ ఒక‌టి. ప్ర‌తీ ఏటా ఈ వ్యాధి బారిన ప‌డుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే తాజాగా డ‌యాబెటిస్‌కు సంబంధించి నిర్వ‌హించిన ఓ అధ్య‌య‌నంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

PREV
15
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న‌ డయాబెటిస్ కేసులు

2023 నాటికి ప్రపంచంలో సుమారు 561 మిలియన్ మంది డయాబెటిస్‌తో జీవిస్తున్నారు. వీరిలో చాలా మంది టైప్ 2 డయాబెటిస్ రోగులు. డయాబెటిస్ ఒక జీవితకాల సమస్య. దానిని నియంత్రించకపోతే కిడ్నీ వ్యాధి, చూపు తగ్గడం, చేతులు కాళ్లు తీసివేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. జీవనశైలిలో మార్పులు, మందులు వాడటం, రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణ వంటివి పాటిస్తే వ్యాధి ప్ర‌భావం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ముఖ్యంగా తొలిదశలోనే గుర్తించి, చికిత్స ప్రారంభిస్తే ఫ‌లితం ఉంటుంది.

25
అధ్యయనం ఎలా జరిగింది?

ఈ పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ను ఎలా గుర్తిస్తున్నారు, చికిత్స చేస్తున్నారు, నియంత్రిస్తున్నారు అనే అంశాలను విశ్లేషించారు.

119 దేశాల నుంచి 266 డేటా సోర్స్‌లు సేకరించారు.

1988 నుండి 2023 వరకూ వచ్చిన సమాచారం ఆధారంగా విశ్లేషించారు.

15 ఏళ్లు పైబడిన వారిని పరీక్షించారు.

రక్తంలో చక్కెర స్థాయిలను ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ లేదా HbA1c టెస్ట్‌లతో కొలిచారు.

డయాబెటిస్ రోగులను ఐదు వర్గాలుగా విభజించారు:

గుర్తించని వారు (undiagnosed)

గుర్తించినా చికిత్స చేయని వారు

చికిత్స పొందుతున్నా రక్తంలో చక్కెర నియంత్రణలో లేని వారు

చికిత్స పొందుతున్న వారు

చికిత్సతో రక్త చక్కెర నియంత్రణలో ఉన్న వారు

35
బయటపడిన ఆశ్చర్యకర విషయాలు

2023లో కేవలం 55.8% మంది మాత్రమే డయాబెటిస్ ఉందని తెలుసుకున్నారు.

అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం మంది ప్రజలకు డయాబెటిస్ ఉందని తెలియదు.

తెలిసిన వారిలో 90% మందికి పైగా చికిత్స పొందుతున్నా, వారిలో కేవలం 40% మందికి మాత్రమే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంది.

మొత్తంగా చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డయాబెటిస్ రోగుల్లో కేవలం 21.2% మందికి మాత్రమే రక్తంలో చక్కెర సరైన స్థాయిలో ఉంది.

అంటే 313 మిలియన్ మంది డయాబెటిస్ ఉన్నట్లు తెలిసినా, వారిలో కేవలం 119 మిలియన్ మంది మాత్రమే సరిగ్గా నియంత్రిస్తున్నారు.

మిగతా 248 మిలియన్ మందికి డయాబెటిస్ ఉందనే విషయం తెలియదు.

45
వయసు, లింగం, ప్రాంతాలవారీగా తేడాలు

పురుషులు (51.8%) కంటే మహిళలు (59.8%) ఎక్కువగా డ‌యాబెటిస్ ఉన్నట్లు తేలింది.

వయసు పెరిగేకొద్దీ గుర్తింపు రేటు పెరుగుతోంది.

మధ్య వయసులో గుర్తించని కేసులు ఎక్కువగా ఉన్నాయి.

ఉన్నత ఆదాయం గల దేశాలు – ఉత్తర అమెరికా (82.9%), దక్షిణ లాటిన్ అమెరికా (79.9%), పశ్చిమ యూరప్ (77.5%)లో గుర్తింపు రేటు ఎక్కువ.

తక్కువ ఆదాయం గల దేశాలు – మధ్య ఆఫ్రికా (16.3%), నైజర్ (10.7%)లో అత్యల్ప రేటు.

2000లో గుర్తించని రోగులు 143 మిలియన్ ఉండగా, 2023లో అది 248 మిలియన్‌కి పెరిగింది.

55
ఈ అధ్యయనంలో కొన్ని పరిమితులు ఉన్నాయి

కొన్ని దేశాల్లో డేటా అందుబాటులో లేకపోవడంతో అంచనాలు మాత్రమే వేశారు.

ఒకే రక్తపరీక్ష ఆధారంగా డయాబెటిస్ అని తేల్చారు, కానీ సాధారణంగా రెండు సార్లు పరీక్ష అవసరం.

ఆహారం, వ్యాయామం వంటి జీవనశైలి మార్పులను పరిగణలోకి తీసుకోలేదు. వీటితో నియంత్రిస్తున్న వారు కూడా "చికిత్స చేయకపోయినవారిని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories