Weight Loss Diet: మనలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. బరువు తగ్గడానికి రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. కానీ మంచి ఫుడ్ ని మితంగా తీసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అవేంటో ఎలా తినాలో ఇక్కడ చూద్దాం.
అధిక బరువు వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి బరువు తగ్గడం అవసరం. బరువు తగ్గాలనుకునేవారు ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం ముఖ్యం. మరి అవేంటో.. చూద్దామా..
26
చియా సీడ్స్
చియా సీడ్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కాబట్టి చియా సీడ్స్ ని డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఈజీగా బరువుతగ్గే అవకాశం ఉంటుంది.
36
పప్పుధాన్యాలు
పప్పు ధాన్యాలలో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అధికంగా తినడాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.
ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఓట్స్ లో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది కూడా కడుపు నిండిన అనుభూతిని పెంచుతుంది. ఫలితంగా తక్కువ తింటారు.
56
చిలగడదుంప
చిలగడదుంపలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన అనుభూతిని కలిగించి, అతిగా తినడాన్ని నియంత్రిస్తాయి. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతేకాదు చిలగడదుంపలోని యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను మెరుగుపరుస్తాయి.
66
బాదం
బాదం.. ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. ఇవి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. అతిగా తినడాన్ని నియంత్రిస్తాయి. బాదంలో ఉండే పోషకాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి.
ఆపిల్, బ్లూబెర్రీ వంటి వాటిలోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఆకలి తగ్గి, బరువు నియంత్రణలో ఉంటుంది.