నేలలో విషపూరితం:
ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మంది ప్రజలు విషపూరిత లోహాలతో కలుషితమైన ప్రాంతాల్లో నివసిస్తున్నారని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. సైన్స్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం దీనిని వెల్లడించింది. ఈ ప్రజలు నివసించే ప్రాంతాలు ఆర్సెనిక్, కాడ్మియం, కోబాల్ట్, క్రోమియం, రాగి, నికెల్, సీసం వంటి విషపూరిత భారీ లోహాలతో కలుషితమై ఉన్నాయని చెప్పింది.
ఈ అధ్యయన ఫలితాలు 'సైన్స్' (Science) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అధునాతన మెషిన్ లెర్నింగ్ పద్ధతిని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా నేల కాలుష్య నమూనాలను అధ్యయనం చేశారు. 1,493 ప్రాంతాలలో నిర్వహించిన అధ్యయనాల నుంచి దాదాపు 8,00,000 నేల నమూనాలను ఈ అధ్యయనం విశ్లేషించారు.
ప్రపంచంలోని వ్యవసాయ భూములలో 14 నుంచి 17 శాతం, అంటే దాదాపు 242 మిలియన్ హెక్టార్ల భూమి వ్యవసాయం చేయడానికి భద్రతా పరిమితులను దాటేసింది. ఈ భూములు కనీసం ఒక భారీ లోహంతో కలుషితమై ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది.