మధుమేహం అదుపు: మధుమేహం.. అదుపులో ఉంచుకోకపోతే క్రమక్రమంగా శరీరంలోని అన్ని ముఖ్య అవయవాల్ని కబళించే రోగం. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం తప్పనిసరి. దీనికోసం రోజుకి పదివేల అడుగులు వేయమని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడు భోజనం తర్వాత 2 నిమిషాలు నడవడం వల్ల షుగర్ లెవెల్స్‌ని ఎంత సులభంగా అదుపులో ఉంచుకోవచ్చో చెబుతున్నారు.
ఆఫీసు, ఇంటిపనితో ఇప్పుడు అందరూ బిజీ. వ్యాయామం చేయడానికి సమయమే దొరకడం లేదు. ఇక ప్రతిరోజూ భోజనం చేసిన వెంటనే రాత్రి నిద్రకు ఉపక్రమిస్తుంటారు. కొందరు మధ్యాహ్నం తిన్న తర్వాత కూడా కునుకేస్తుంటారు. ఇలా ఎక్కడికీ వెళ్లకుండా కూర్చుని లేదా పడుకోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీన్ని నివారించడానికి, ప్రతి భోజనం తర్వాత నడవాలి. కేవలం 2 నిమిషాలు నడవడం కూడా శరీరంలో పెద్ద మార్పులను తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.
25
నడకతో ప్రయోజనాలు
భోజనం తర్వాత వెంటనే కూర్చోకుండా లేదా నిద్రపోకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. కేవలం రెండు నిమిషాలు అంటే చాలా తక్కువ అనిపించవచ్చు, కానీ రెండు నిమిషాలు నడవడం మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకుంటే, మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని నివారించడానికి, భోజనం తర్వాత 2 నిమిషాలు నడవవచ్చు. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది.
35
అధ్యయన సమాచారం
కొన్ని సంవత్సరాల క్రితం స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో, భోజనం తర్వాత 2 నుండి 5 నిమిషాలు నడిచే వారికి, భోజనం తర్వాత కూర్చునే వారి కంటే రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉందని కనుగొన్నారు. భోజనం తర్వాత కూర్చోకుండా నిలబడటం కూడా దానికి సహాయపడుతుంది. కానీ నడవడం ఉత్తమం.
నడిచేటప్పుడు కాలు, మధ్య కండరాలు పనిచేస్తాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ను ఉపయోగించుకుంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత వెంటనే నడిస్తే నీరసం రాకుండా ఉంటుంది. చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది.
45
భోజనం తర్వాత నడకతో ప్రయోజనాలు
షుగర్, గుండె జబ్బుల నియంత్రణ:
ఈ రెండు వ్యాధులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే రక్తనాళాలు, రక్తపోటు, గుండె ఆరోగ్యానికి చెడు ప్రభావం చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల కాలక్రమేణా రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులకు ఎక్కువ నష్టం కలుగుతుంది. కాబట్టి ఖాళీ సమయంలో నడక వ్యాయామం చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తపోటు కూడా తగ్గుతుంది.
55
ఎప్పుడు నడవాలి?
భోజనం తర్వాత 60 నుండి 90 నిమిషాలలోపు కేవలం 2 నిమిషాల నుండి ప్రారంభించి వీలైనంత వరకు నడవవచ్చు. భోజనం తర్వాత ఎంత త్వరగా నడిస్తే అంత త్వరగా రక్తంలో చక్కెర స్థాయి పెరగడాన్ని నియంత్రించవచ్చు. కనీసం 10 నుండి 15 నిమిషాలు నడిస్తే మంచిది.