మన శరీరంలో అత్యంత ముఖ్యమైనది, అత్యంత శక్తిమంతమైన అవయవం లివర్. అరవై శాతం పాడైనా తనకు తాను మరమ్మతు చేసుకోగలదు. అది ఎంత పవర్ఫుల్ అయినా మన చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యల కారణంగా దాని పనితీరు మందగిస్తుంది. ఈ పరిస్థితి రావడానికి ముందే కొన్ని సంకేతాలు పంపుతుంది. ప్రపంచ లివర్ దినోత్సవం 2025 సందర్భంగా మీ లివర్ డీటాక్స్ అవసరం అని సూచించే కీలక సంకేతాల గురించి తెలుసుకుందాం. అలసట నుండి మెదడు మసక వరకు, లివర్ ఒత్తిడిని ఎలా గుర్తించాలో , ఎలా పరిష్కరించాలో ఒక అవగాహన తెచ్చుకుందాం.
శరీరాన్ని డీటాక్సిఫై చేయడంలో, జీర్ణక్రియకు సహాయం చేయడంలో, హార్మోన్లను నియంత్రించడంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే లివర్ మన శరీరానికి అత్యంత ఆవశ్యకర అవయవం. లివర్ పై భరించలేనంత ఒత్తిడి పడినప్పుడు, పనితీరులో తేడా వచ్చినప్పుడు, అనారోగ్యం తలెత్తినప్పుడు కొన్ని సంకేతాలు పంపిస్తుంటుంది. వాటిని గుర్తించి సకాలంలో చర్యలు తీసుకోవాలి. జాగ్రత్తపడాలి.
26
నిరంతర అలసట
బాగా నిద్రపోయిన తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపించడం లివర్ ఓవర్‌లోడ్‌కు సంకేతం. లివర్ విషాన్ని ప్రాసెస్ చేయడానికి కష్టపడినప్పుడు, దాని పనితీరు మందగిస్తుంది. శక్తికి తగ్గట్టు పనిచేయలేకపోతుంది. నిరంతరం అలసటగా ఉందన్నప్పుడు దాన్ని విస్మరించకూడదు. ఏవైనా జీవనశైలి మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
36
జీర్ణ సమస్యలు
భోజనం తర్వాత తరచుగా ఉబ్బరం లేదా అసౌకర్యం అనిపించడం కాలేయం ఒత్తిడిని సూచిస్తుంది. జీర్ణక్రియ సరిగా సాగాలంటే లివర్ అత్యంత అవసరం. అది సరిగా పని చేయకపోతే పోషకాలు శరీరానికి అందవు. రకరకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఈ లక్షణాలు కనిపించగానే తాజా ఆకుకూరలు, సిట్రస్ పండ్లు వంటి లివర్-స్నేహపూర్వక ఆహారాలను తీసుకోవడం చేయాలి. దాంతో ఆటోమేటిగ్గా సమస్య తగ్గుముఖం పడుతుంది.
46
చర్మ మార్పులు
లివర్ శరీరంలోని వ్యర్థాలను సమర్థంగా ఫిల్టర్ చేయనప్పుడు చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. భరించలేనంత దురద ఉంటుంది. ఇవి లివర్ సమస్యలకు సంకేతం. చర్మ సంబంధిత లక్షణాల ద్వారా ఇది వ్యక్తమవుతుంది. హైడ్రేటెడ్ గా ఉండటం, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం చేయాలి. ఇది లివర్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
56
మెదడు మసక
లివర్ ఓవర్‌లోడ్‌తో సతమతం అవుతున్నప్పుడు ఏకాగ్రత కష్టం అవుతుంది. చిన్న చిన్న విషయాలను మర్చిపోతుంటారు. ఒత్తిడికి గురైన లివర్ రక్తప్రవాహంలో విష పదార్థాలు పేరుకుపోవడం వల్ల మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. యోగా లేదా ధ్యానం వంటి సాధారణ డీటాక్స్ పద్ధతులు మానసిక స్పష్టతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
66
మద్యం ద్వారా..
మద్యం తీసుకుంటున్నప్పుడు తీవ్ర అసౌకర్యంగా ఉండటం అది లివర్ ఒత్తిడికి సంకేతం కావచ్చు. లివర్ ఆల్కహాల్‌ను ప్రాసెస్ చేస్తుంది. మద్యాన్ని అరిగించుకోలేని భావన కాలేయంలో సమస్యలు ఉన్నాయని గుర్తించడంలో సాయపడుతుంది. ఈ సమయంలో వెంటనే మద్యం మానేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. వైద్య నిపుణులను సంప్రదించాలి.