బరువు తగ్గడానికి చాలామంది రకరకాల చిట్కాలు ఫాలో అవుతుంటారు. వాటిలో ఒకటే మెంతులు, సోంపు వాటర్. బరువు తగ్గడానికి ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందట. దీన్ని ఎలా తయారుచేయాలి? ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.
బిజీ లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్లతో బరువు తగ్గడం కష్టం. అయితే కొన్ని ఇంటి చిట్కాలు జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడతాయి. మెంతులు-సోంపు నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును సమతుల్యం చేస్తుంది.
25
బరువు తగ్గడానికి..
బరువు తగ్గాలనుకునేవారికి మెంతులు మంచి ఎంపిక. రోజూ మెంతులను గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీని వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.
35
ఆకలి తగ్గడానికి..
మెంతులు కార్బోహైడ్రేట్ శోషణను నెమ్మది చేస్తాయి. దీనివల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఆకలి తగ్గుతుంది. మెంతులు తీసుకోవడం వల్ల.. శరీరంలోని కేలరీలు సమర్థవంతంగా కరిగిపోతాయి.
ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మెంతులు, ఒక చెంచా సోంపు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడకట్టి గోరువెచ్చగా తాగవచ్చు.
55
ఇది గుర్తుంచుకోండి!
మెంతులు, సోంపు సాధారణంగా సురక్షితమైనవే అయినప్పటికీ.. కొంతమందికి ఇవి పడకపోవచ్చు. అలెర్జీ రావచ్చు. అంతేకాదు మెంతులు అధికంగా తీసుకోవడం వల్ల అతిసారం లేదా కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. కాబట్టి మితంగా తీసుకోవాలి. వైద్యుల సలహాతో తీసుకోవడం ఇంకా మంచిది.