Health Tips: వీటిని ఫ్రిజ్ లో పెడితే.. క్యాన్సర్ వచ్చే అవకాశం !

Published : Jul 17, 2025, 11:27 AM IST

Health Tips:  చాలామంది కూరగాయలు త్వరగా పడుకాకుండా ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే, అన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో ఉంచడం ఆరోగ్యకరం కాదు. కొన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందట. ఇంతకీ ఆ ఆహారపద్ధాలేంటీ? .

PREV
15
ఫ్రిజ్‌లో ఉంచకూడని ఆహారాలు..

ఫ్రిజ్ వలన ఆహారం వృథా తగ్గుతుంది. వంటలో సమయం, శ్రమ ఆదా అవుతుంది. అందుకే దాదాపు ప్రతి ఇంట్లో ఫ్రిజ్ వినియోగం పెరిగింది. కానీ ఫ్రిజ్‌లో ఉంచిన కొన్ని ఆహారాలు విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. అవి బాక్టీరియా, ఫంగస్ వృద్ధికి దారితీయడంతో పాటు, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమవచ్చు. ఫ్రిజ్‌లో ఉంచకూడని కొన్ని ముఖ్యమైన ఆహారాల గురించి తెలుసుకోండి..

25
వెల్లుల్లి

పొట్టు తీసిన వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఇలా చేస్తే.. వెల్లుల్లికి  త్వరగా బూజు పడుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా.. ఫ్రిజ్‌లో వెల్లుల్లిని ఉంచడం వల్ల దాని రుచి, పోషకాలు నాశనమవుతాయి. వెల్లుల్లిని నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే.. దానిని ఫ్రిజ్ వెలుపల చల్లని, పొడి ప్రదేశంలో ఉంచడం.

35
ఉల్లిపాయ

ఉల్లిపాయలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకూడదు, వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని పిండి పదార్థం చక్కెరగా మారి, బూజు పట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతలు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. కాబట్టి ఉల్లిపాయలను ఎల్లప్పుడూ పొడిగా, చీకటి ప్రదేశంలో ఉంచాలి.

45
అల్లం

చాలా మంది అల్లంను తాజా గా ఉంచేందుకు ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్లం ను ఫ్రిజ్‌లో ఉంచితే.. ఫంగస్ ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. ఈ ఫంగస్ మూత్రపిండాలు, కాలేయానికి హాని కలిగించవచ్చు. కాబట్టి అల్లంను ఎల్లప్పుడూ పొడి, గాలియాడే ప్రదేశంలోనే ఉంచాలి. 

55
అన్నం

అన్నం ను 24 గంటల కంటే ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచితే, బాక్టీరియా వృద్ధి చేసే అవకాశముంది. దీని వల్ల అది విషపూరితంగా మారవచ్చు. మళ్లీ వేడి చేసినప్పుడు అన్నం పూర్తిగా బాగా వేడెక్కిందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories