Bath Soap: మీ ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!

Published : Jul 17, 2025, 03:51 PM IST

మనం ముఖం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి రెగ్యులర్ గా సబ్బులను వాడుతుంటాం. అయితే చాలా ఇళ్లల్లో కుటుంబమంతా ఒకే సబ్బును వాడుతుంటారు. అలా అందరూ ఒకే సబ్బు వాడటం మంచిదో.. కాదో ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
15
ఒకే సబ్బును అందరూ వాడితే ఏమవుతుంది?

ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఒకే సబ్బును ఇంటిల్లిపాది వాడుతుంటారు. కొన్ని ఇళ్లల్లో మాత్రం   ఎవరికి నచ్చిన సబ్బును వారు విడివిడిగా కొనుక్కుని వాడుతుంటారు. నిజానికి ఇదే మంచి పద్ధతి. ఒకే సబ్బును చాలామంది వాడితే లాభాలకంటే.. నష్టాలే ఎక్కువ.  

25
ఒకే సబ్బు వాడటం వల్ల వచ్చే సమస్యలు

ఒకే సబ్బును చాలామంది వాడటం వల్ల చర్మ సమస్యలు పెరగవచ్చు. కొందరు సబ్బు వాడిన తర్వాత దానిపై ఉన్న నురగను అలాగే ఉంచుతారు. ఈ నురగలో సబ్బు వాడిన వ్యక్తి శరీరంలోని బ్యాక్టీరియా ఉండవచ్చు. లేదా ఏదైన చర్మ వ్యాధి ఉంటే దాని ప్రభావం ఈ నురగలో ఉండవచ్చు. దీన్ని మరొకరు వాడితే ఆ ఇన్ఫెక్షన్ వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. బాగా కడిగి ఆరబెడితే మరొకరు వాడినప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు.

35
చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ

సబ్బుల ఉపరితలంపై వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి ఉండే అవకాశం ఉంది. సబ్బును చాలామంది వాడినప్పుడు ఈ క్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన లేదా చర్మ సమస్యలు లేనివారు వాడినప్పుడు సబ్బు ద్వారా క్రిములు వ్యాపించే అవకాశం లేదు. ఎగ్జిమా వంటి చర్మ వ్యాధి ఉన్నవారి నుంచి సబ్బు ద్వారా అది ఇతరులకు కూడా వ్యాపించవచ్చు.

45
లిక్విడ్ సోప్ వాడవచ్చు

ఒకరు వాడిన సబ్బును మరొకరు వాడాల్సి వస్తే, ఒకరు వాడిన తర్వాత సబ్బును బాగా ఆరబెట్టాలి. భార్యా భర్తలైనా, తల్లిదండ్రులు, పిల్లలైనా ఈ పద్ధతినే పాటించాలి. ఈ సబ్బు సమస్య నుంచి తప్పించుకోవాలనుకునేవారు మార్కెట్లో దొరికే లిక్విడ్ సోప్ కొని వాడవచ్చు. ఈ లిక్విడ్ సోప్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ అనే మాటకు చోటే లేదు. నార్మల్ సబ్బులను కొని వాడటం కంటే.. ఇలాంటి లిక్విడ్ సోప్ వాడటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

55
వైద్య సలహా అవసరం

సబ్బు అనేది మన శరీరాన్ని శుభ్రపరచడానికి, దుమ్ము, ధూళి, క్రిములు, చెమట వాసనను తొలగించడానికే. కాబట్టి ఒకరు వాడిన సబ్బును మరొకరు వాడటం మానేయండి. అదే సమయంలో సబ్బును శరీరం అంతటా ఎక్కువసేపు రుద్ది స్నానం చేయకూడదు. గరిష్టంగా ఐదు నిమిషాల్లో స్నానం పూర్తి చేయాలి. ముందుగా సబ్బును చేతుల్లోకి తీసుకుని బాగా రుద్ది నురగ వచ్చిన తర్వాత చేతులతోనే శరీరంపై రుద్దుకోవాలి. సబ్బును నేరుగా శరీరంపై రుద్దకూడదు. చర్మ అలెర్జీ, మొటిమలు, పొడి చర్మం లేదా వేరే చర్మ సమస్య ఉన్నవారు వైద్య సలహా మేరకు సబ్బు కొని వాడవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories