వర్షాకాలంలో డయాబెటిస్ ఉన్నవారు పాటించాల్సిన మరికొన్ని కీలక ఆరోగ్య సూచనలు ఇవే:
హైడ్రేషన్: తేమతో కూడిన వాతావరణం ఉన్నా శరీరం నీటి కొరతకు లోనవ్వకూడదు. అందుకే తగినంత నీరు తాగాలి. ఆకుకూరల రసం, నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన పానీయాలు కూడా తీసుకోవాలి.
వ్యాయామం: ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
చెకప్: ప్రతి మూడు నెలలకు ఒకసారి HbA1c సహా డయాబెటిస్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ స్థాయిని అంచనా వేసి, అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.
పాదాల పరిశీలన: వర్షాకాలంలో రోజూ పాదాలను తనిఖీ చేయాలి. పాదాల్లో రక్త ప్రసరణ తక్కువగా ఉన్నప్పుడు చర్మం రంగు మార్పులు, అలర్జీలు, గాయాలు వంటి సమస్యలు కనిపించవచ్చు.కాబట్టి ప్రారంభ దశలోనే గుర్తించడం అవసరం.
ఈ సూచనలు పాటించడం ద్వారా వర్షాకాలంలో డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్లు నుంచి రక్షణ పొందవచ్చు.