Workout : వ్యాయామం తర్వాత చల్లని నీళ్లతో స్నానం చేస్తున్నారా ? ఈ తప్పు చేయకండి!

Published : Jul 01, 2025, 11:21 AM IST

Cold Shower After Gym Workout: జిమ్‌లో వ్యాయామం చేసిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలా? లేదా వేడి నీటితో చేయాలా ?  చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలో జరిగే మార్పులేంటీ? అనేది తెలుసుకుందాం.

PREV
16
చల్లటి నీటితో స్నానం చేయాలా? వేడి నీటితోనా ?

జిమ్‌లో వ్యాయామం చేసిన తర్వాత శరీరం చెమటతో తడిసిపోతుంది. అలసటగా అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా స్నానం చేయాలి. అయితే.. కొందరూ కండరాల నొప్పిని తగ్గించుకోవడానికి వేడి నీటితో స్నానం చేస్తారు. వేడినీటి స్నానం వల్ల  చేతులు, కాళ్ళ నొప్పులు తగ్గుతాయని భావిస్తారు. మరికొందరు చల్లటి నీటితో స్నానం చేస్తారు. ఇంతకీ వ్యాయామం తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలా? లేదా వేడి నీటితో చేయాలా ? అనేది తెలుసుకుందాం.

26
చల్లని నీటి స్నానం

సాధారణంగా జిమ్‌లో వ్యాయామం చేసిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది కాదు. చల్లటి నీటితో స్నానం చేస్తే ప్రయోజనాలున్నప్పటికీ, వ్యాయామం చేసిన వెంటనే చల్లని నీటితో స్నానం చేస్తే ప్రయోజనాల కంటే ప్రతికూల ప్రభావాలే ఎక్కువ. చల్లని నీటిలో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోతుంది. కండరాల నొప్పులు, తిమ్మిర్లు రావచ్చు. 

36
ఎందుకు చేయకూడదు?

జిమ్ తర్వాత వెంటనే చల్లటి నీటితో స్నానం చేయకూడదనే 4 ముఖ్యమైన కారణాలు 

కండరాల గట్టిపడటం: కఠినమైన వ్యాయామం తర్వాత వెంటనే చల్లటి నీటితో స్నానం చేస్తే.. కండరాలను గట్టిపడి,  నొప్పులు, తిమ్మిర్లు తలెత్తే అవకాశముంది. 

 రక్తప్రసరణకు ఆటంకం: శరీరం సహజంగా చల్లబడే ప్రక్రియకు చల్లటి నీరు విఘాతం కలిగిస్తుంది. రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల కండరాలకు రక్తప్రవాహం తగ్గుతుంది.

కోలుకునే ప్రక్రియ ఆలస్యం: వ్యాయామం తర్వాత వాపు, కండరాల నొప్పిని తగ్గించడానికి చల్లటి నీటి స్నానం సహాయపడుతుంది, కానీ వెంటనే స్నానం చేయడం వల్ల శరీరం సహజంగా కోలుకునే ప్రక్రియ ఆలస్యం అవుతుంది.

అలసట:  జిమ్ నుండి వచ్చిన తర్వాత శరీరం అలసిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో వెంటనే చల్లటి నీటితో స్నానం చేస్తే ఆ అలసట మరింత పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో శక్తి క్షీణిస్తుంది.

46
ప్రత్యామ్నాయ మార్గాలు
  •  చల్లటి నీటికి బదులుగా వేడి నీటితో స్నానం చేయడం వల్ల  కండరాల నొప్పులు తగ్గుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి, అలసటను తగ్గిస్తుంది. 
  • స్నానం చేయడానికి ముందు నడక లేదా స్ట్రెచింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరం సహజంగా చల్లబడుతుంది.
  • చల్లటి నీటితో స్నానం చేయాలనుకుంటే.. వెంటనే చల్లటి నీటితో మీ శరీరానికి షాక్ ఇవ్వకుండా, నీటి ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గించాలి.
  • చివరగా శరీరం పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాత మాత్రమే స్నానం చేయడం ఆరోగ్యానికి ఉత్తమం. 
56
ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి

మీరు మీ కండరాలను పెంచుకోవాలనుకుంటే, చల్లటి నీటి స్నానం చేయడం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే మీరు కఠినమైన వ్యాయామం చేసిన వెంటనే చల్లటి నీటితో స్నానం చేస్తే, శరీరం సహజంగా చేసే కండరాల మరమ్మతు, పెరుగుదల ప్రక్రియను చల్లటి నీరు మందగిస్తుందన్న విషయాన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

66
సైన్స్ ఏమి చెబుతుంది?

జిమ్ తర్వాత వెంటనే చల్లటి నీటితో స్నానం చేస్తే, కండరాల పెరుగుదల, బలం తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చల్లటి నీరు శరీరంలోని వాపును తగ్గిస్తుంది. కానీ,  అదే సమయంలో, కండరాల అభివృద్ధికి అవసరమైన రసాయన మార్గాలను అణిచివేస్తుంది. అందువల్ల, మసిల్స్ గెయిన్ కోరుకునేవారు జిమ్ తర్వాత కనీసం 1.5 నుంచి 2 గంటల విరామం తర్వాతే చల్లటి నీటితో స్నానం చేయడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories