Dry Eyes : కళ్లు పొడిబారుతున్నాయా? వెంటనే ఇలా చేయండి!

Published : Jul 01, 2025, 10:07 AM IST

Dry Eyes: కంప్యూటర్లు ఎక్కువగా వాడేవారిలో కళ్ళు పొడిబారడం సర్వసాధారణం. దీన్నే 'కంప్యూటర్ విజన్ సిండ్రోమ్' (CVS) లేదా 'డిజిటల్ ఐ స్ట్రెయిన్' అంటారు. దీని లక్షణాలు, పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. 

PREV
16
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్

ఈ రోజుల్లో అన్ని రంగాల్లో కంప్యూటర్ వాడకం పెరిగింది. దీని వల్ల చాలా మంది ఎక్కువ సేపు స్క్రీన్‌ ముందు కూర్చోవాల్సి వస్తుంది. ఫలితంగా కళ్ల పొడిబారడం, మంట, మసక దృష్టి వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది చాలా మందిలో సాధారణ సమస్యగా మారింది.  దీన్నే 'కంప్యూటర్ విజన్ సిండ్రోమ్' (CVS) లేదా 'డిజిటల్ ఐ స్ట్రెయిన్' అంటారు. దీని లక్షణాలు, పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. 

26
సమస్యలు

కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నప్పుడు రెప్పపాటు సంఖ్య తగ్గిపోతుంది. అంటే.. సాధారణంగా ఒక నిమిషానికి 15 నుండి 20 సార్లు కన్ను రెప్పలను ఆడిస్తాం. రెప్ప పాటు తగ్గడం వల్ల కళ్ల తేమ తగ్గి, కళ్ళు పొడిబారతాయి. అలాగే.. బ్లూ స్క్రీన్‌ కాంతి (నీలి కాంతి) కళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఏసీ/ఫ్యాన్ గాలి కళ్లను మరింత పొడిబారేలా చేస్తుంది. ఈ కారణాల వల్ల కళ్ల అలసట,  పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

36
కళ్ళు పొడిబారడం లక్షణాలు ఏమిటి?

కళ్ళు పొడిబారినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్ళలో ఇసుక, దుమ్ము పడినట్టు అనిపించడం, దురద, మంట, ఎర్రబారడం, చూపు మసకబారడం, కళ్ళు నొప్పి, అలసట, కళ్ళు తెరవడం కష్టం కావడం, కాంతికి చికాకుగా అనిపించడం, కళ్ళ నుంచి నీరు కారడం, తలనొప్పి, మెడనొప్పి వంటివి లక్షణాలు కనిపిస్తాయి.  

నివారణ:  

20–20–20 నియమం: ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్లపాటు చూడాలి. ఇది కళ్లకు విశ్రాంతిని ఇచ్చి, పొడిబారడాన్ని తగ్గిస్తుంది.

46
ఈ టిప్స్ పాటించండి

కంప్యూటర్ వాడుతున్నప్పుడు తరచుగా కన్నురెప్పలను ఆడించాలి. ఇలా చేయడం వల్ల కళ్ళలో తేమ నిలిచి ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు కంటి చుక్కలు వాడవచ్చు. కంప్యూటర్ స్క్రీన్ కళ్ళకు 20 నుండి 30 అంగుళాల దూరంలో ఉండాలి. స్క్రీన్ పైభాగం కంటికి 15 డిగ్రీల దిగువన ఉండాలి. గదిలో కాంతి కళ్ళకు హాయిగా ఉండేలా చూసుకోవాలి. స్క్రీన్ ప్రతిబింబం లేకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు కళ్లను పొడిబారకుండా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

56
నివారణ చర్యలు
  • కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ లలోని బ్లూ లైట్ ఫిల్టర్, నైట్ మోడ్ ఆప్షన్లు వాడాలి.
  • బ్లూ లైట్ గ్లాసెస్ ఉపయోగించవచ్చు 
  • శరీరం హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు రోజూ తగినంత నీరు తాగాలి.
  • ఒమేగా-3 ఆమ్లాలు ఉండే సాల్మన్, ట్యూనా, అవిసె, చియా గింజలు, వాల్ నట్స్ ఆహారం తీసుకోవాలి.
  • అవసరమైతే సప్లిమెంట్స్ డాక్టర్ సలహాతో తీసుకోవచ్చు. 
66
సూచనలు
  •  వెచ్చని నీటితో ముంచిన బట్టను కళ్లపై ఉంచడం వల్ల నూనె గ్రంధులు తెరుచుకొని తేమ పెరుగుతుంది
  •  ధూళి, గాలి నుంచి కళ్లను రక్షించేందుకు కళ్ళజోళ్ళు వాడాలి
  •  బైక్‌పై ప్రయాణిస్తే కళ్ళజోళ్ళు తప్పనిసరి
  • తగినంత విశ్రాంతి తీసుకోవాలి అంటే రోజూ 7–8 గంటలు నిద్ర అవసరం 
  • లక్షణాలు ఎక్కువైతే కంటి వైద్యుడిని సంప్రదించాలి. డాక్టర్ సలహా లేకుండా కంటి చుక్కలు, మందులు వాడకూడదు. ఈ సూచనలు కళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతో సహాయపడతాయి.
Read more Photos on
click me!

Recommended Stories