Soaked Foods: వీటిని నానబెట్టి పరగడుపున తింటే.. ఊహించని లాభాలు..

Published : Jul 01, 2025, 09:32 AM IST

Soaked Foods Health Benefits :  డ్రై ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే డాక్టర్లు కూడా ప్రతీ రోజూ డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలని సూచిస్తుంటారు. ఇలాంటి డ్రై ఫ్రూట్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టిన తింటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. 

PREV
15
బాదం:

బాదం పప్పులను నానబెట్టడం వల్ల పోషకాల శోషణకు అడ్డుగా ఉన్న ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. అలాగే.. బాదం తొక్క మెత్తబడి సులభంగా జీర్ణమవుతుంది.

ప్రయోజనాలు:

  • మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తికి మంచిది. 
  • విటమిన్ E ద్వారా మెదడు కణాలకు రక్షణ. 
  • కాల్షియంతో ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. 
  • యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. 
  • బాదంలోని హెల్తీ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 
25
అక్రోట్ :

బాదం లాగే, అక్రోట్ పప్పులలో కూడా ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. నానబెట్టడం వల్ల ఈ యాసిడ్ తొలగిపోతుంది.  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి ముఖ్యమైన పోషకాలను శోషిస్తుంది. అక్రోట్స్ రుచికి కొంచెం చేదుగా ఉంటాయి. నానబెట్టడం వల్ల చేదు తగ్గి రుచిగా మారుతాయి.  

ప్రయోజనాలు: అక్రోట్స్ రోజూ తినడం వల్ల మెదడు చురుకుగా మారుతుంది. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులోని మెలటోనిన్ అనే హార్మోన్ మంచి నిద్రకు దోహదపడుతుంది.  

35
మెంతులు:

మెంతులు చేదుగా ఉంటాయి. వాటిని నానబెట్టడం వల్ల చేదు తగ్గి రుచిగా మారుతాయి. మెంతుల కషాయం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మెంతులలో అధికంగా ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

ప్రయోజనాలు: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మలబద్ధకం,  అజీర్తి వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం. మహిళల్లో నెలసరి నొప్పులు, ఇతర సమస్యలను తగ్గిస్తుంది. మెంతులకు శరీర వేడిని తగ్గించే ప్రకృతి గుణం ఉంది. 

 ఎలా తీసుకోవాలి: 1 టీస్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ మెంతులు, నీటిని కలిపి పరగడుపున తాగాలి.

45
ఎండుద్రాక్ష:

ఎండుద్రాక్షలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. నానబెట్టడం వల్ల చక్కెర శాతం తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు సులభంగా శరీరంలోకి అందుతాయి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.  

ప్రయోజనాలు:   

  • రక్తహీనత నివారణకు సహాయపడుతుంది ( ఐరన్ అధికం)
  • రక్తాన్ని శుద్ధి చేసి, విషపదార్థాలను తొలగిస్తుంది. 
  • చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. 
  • మలబద్ధకానికి ఉపశమనం
  • కంటి ఆరోగ్యానికి మేలు  

ఎలా తీసుకోవాలి: 8-10 ఎండుద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం నీటితో సహా తినండి.

55
చియా విత్తనాలు:

చియా విత్తనాలను నీటిలో నానబెడితే జెల్ లాగా మారుతాయి. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. పోషకాలు సులభంగా శరీరంలోకి అందుతాయి.

ప్రయోజనాలు:  

  •  చియా సీడ్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం నివారిస్తుంది
  • ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి
  • ఆకలిని నియంత్రించి, బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి
  • కాల్షియం, మెగ్నీషియం వల్ల ఎముకలు బలపడతాయి.

ఎలా తీసుకోవాలి: 1–2 టీస్పూన్ల చియా విత్తనాలను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం నిమ్మరసం లేదా తేనెతో కలిపి తాగాలి. పండ్ల రసాల్లో కూడా కలిపి తీసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories