Uric Acid: యూరిక్ యాసిడ్ పేరుకుపోయి కీళ్లు, కిడ్నీలలో స్ఫటికాలుగా మారినప్పుడు ఇబ్బందులు మొదలవుతాయి. మన పెరటిలో లభించే కాకరకాయతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి కాకరకాయని ఎప్పుడు? ఎలా తినాలో తెలుసుకుందాం.
యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ప్యూరిన్ అనే పదార్థం విచ్ఛిన్నమవడం ద్వారా ఏర్పడే సహజ వ్యర్థ పదార్థం. సాధారణంగా ఇది రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరి మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. అయితే శరీరం దీనిని సమర్థవంతంగా బయటకు పంపలేకపోతే, యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతుంది.
యూరిక్ యాసిడ్ స్థాయి అధికమైతే.. కీళ్ల నొప్పులు (గౌట్), కిడ్నీలో రాళ్లు, బిపి (హై బ్లడ్ ప్రెషర్), గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రస్తుతం జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో ఈ సమస్య తలెత్తుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ స్థాయిని సరైన సమయంలో గుర్తించి, నియంత్రించడం అత్యంత అవసరం.
25
కాకరకాయతో యూరిక్ యాసిడ్ కు చెక్
యూరిక్ యాసిడ్ సాధారణంగా మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వెళుతుంది. కానీ, ఇది సమర్థవంతంగా బయటకు వెళ్లకపోతే, రక్తంలో దాని స్థాయి పెరిగుతుంది. యూరిక్ యాసిడ్ కీళ్ల మధ్య చేరి నొప్పి, వాపు కలిగిస్తుంది. ముఖ్యంగా పాదాల, మోకాళ్ల, వేళ్ళ కీళ్లలో తీవ్ర నొప్పి కలుగుతుంది. దీనివల్ల కూర్చోవడం, లేవడం వంటి సాధారణ పనులూ కష్టంగా మారతాయి. దీన్ని గౌట్ (Gout) అంటారు. దీని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన కీళ్ల సమస్యగా మారుతుంది
35
అద్భుతమైన ఔషధం
ఇలాంటి పరిస్థితుల్లో యూరిక్ యాసిడ్ నియంత్రణ కోసం ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ఔషధం కాకరకాయ. ఇది కేవలం రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
రోజూ ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కాకరకాయ రసం తీసుకోవడం ద్వారా శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లే ప్రక్రియ వేగవంతమవుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఆంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచి, యూరిక్ యాసిడ్‌ను సహజంగా తొలగించడంలో సహాయపడతాయి.
కాకరకాయలో ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాల్షియం, బీటా కెరోటిన్, విటమిన్ సి లాంటి మినరల్స్, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరక శక్తిని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
కాకరకాయ జ్యూస్ డయాబెటిస్ ఉన్నవారికి ఓ వరం. ఇందులో ఉండే విటమిన్ A, విటమిన్ C, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో, ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచడంలో కీలకంగా పనిచేస్తాయి. రోజూ పరిమిత మోతాదులో కాకరకాయ రసం తాగడం ద్వారా డయాబెటిస్‌తో పాటు యూరిక్ యాసిడ్ లాంటి సమస్యలను నియంత్రించవచ్చు.
55
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి కాకరకాయని ఎలా తినాలి?
యూరిక్ యాసిడ్ నియంత్రణ కోసం... ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అరకప్పు కాకరకాయ జ్యూస్ తాగడం చాలా మంచిది. దీనిలోని సహజ ఔషధ గుణాలు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించి, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
చేదు తగ్గించాలంటే: కాకరకాయ రసంలో కొద్దిగా ఉప్పు లేదా నిమ్మరసం కలిపితే.. రుచి మారుతుంది. అంతే కాకుండా శోషణను కూడా సులభతరం చేస్తుంది.
ఇంకా ఎలా తీసుకోవచ్చు?
కాకరకాయను సాధారణంగా కూరలుగా వండుకుని తీసుకోవచ్చు.
వేపుడు చేయకుండా తక్కువ నూనెతో వండటం మంచిది.
గమనిక: కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా, మీకు డయాబెటిస్ లేదా యూరిక్ యాసిడ్ సమస్యలు ఉంటే, డాక్టర్ సలహాతో మోతాదును నిర్ణయించుకోవాలి. ప్రత్యేకించి మందులు తీసుకుంటున్నవారు జాగ్రత్తగా ఉండాలి.