Pyramid Walking for Weight Loss: మన ఆరోగ్యానికి నడక ఎంతో ముఖ్యం. అయితే, సాదా నడక కంటే మరింత ఫలితాలిచ్చే పద్ధతి ఉంది. అదే పిరమిడ్ వాకింగ్. ఇంతకీ పిరమిడ్ వాకింగ్ అంటే ఏమిటి? వాకింగ్ ఎలా చేయాలి? దాని ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
నడక (Walking).. శారీరక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. రోజూ నడక అలవాటు బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యం మెరుగుపడటంలో సహాయపడుతుంది. అయితే.. పిరమిడ్ వాకింగ్ మాత్రం కొంచెం ప్రత్యేకమైనది. పిరమిడ్ వాకింగ్ ఎలా చేస్తారు? పిరమిడ్ వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటీ? తెలుసుకుందాం..
24
బరువు తగ్గించడంలో పిరమిడ్ వాకింగ్ పాత్ర
పిరమిడ్ వాకింగ్ అనేది నడకలో వేగాన్ని పిరమిడ్ ఆకారంలో మారుస్తూ చేసే వ్యాయామం. దీనిని 20–25 నిమిషాలపాటు చేస్తే, సాధారణ నడక కంటే చాలా ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఉదాహరణకు: మొదట 5 నిమిషాలు నెమ్మదిగా నడవాలి, తర్వాత 5 నిమిషాలు వేగంగా నడవాలి, మళ్లీ 5 నిమిషాలు నెమ్మదిగా నడవాలి.
ఈ విధంగా వేగాన్ని నియంత్రిస్తూ నడక కొనసాగించడం వల్ల శరీరంలోని కండరాలు బలపడతాయి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు అనుసరించదగిన, సమర్థవంతమైన వ్యాయామం.
34
ప్రయోజనాలు
పిరమిడ్ వాకింగ్ వల్ల శరీరంలో ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీని ఫలితంగా బరువు తగ్గడంలో వేగంగా మార్పు కనిపిస్తుంది. సాధారణ నడకతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. మధ్యస్థ, వేగవంతమైన నడక కండరాలకు ఉత్తేజాన్ని ఇస్తాయి. వేగాన్ని పెంచుతూ-తగ్గిస్తూ నడవడం మెరుగైన కార్డియో వ్యాయామంగా పనిచేస్తుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరచి, శ్వాసకోశాలను బలోపేతం చేస్తుంది.
పిరమిడ్ వాకింగ్ వల్ల కాళ్లు, తుంటి, మధ్య భాగంలోని కండరాలను బలోపేతం అవుతాయి. వేగం పెరిగే సమయంలో కండరాలు పటిష్టంగా మారతాయి. అదే సమయంలో శరీరం కూడా మెరుగవుతుంది. అలాగే.. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా పిరమిడ్ వాకింగ్ చేస్తే కీళ్ల చలనం మెరుగవుతూ, నొప్పులు తగ్గతాయి. కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలపడడంతో నెమ్మదిగా నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.