Empty stomach: పరగడుపున ఇవి తింటున్నారా? అయితే ఇప్పుడే ఆపండి

Published : Mar 06, 2026, 03:47 PM ISTUpdated : Mar 06, 2026, 09:56 PM IST

Empty stomach: మన ఆరోగ్యం మన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.  చాలా మంది ఖాళీ కడుపుతో ఏమి తింటున్నామో పెద్దగా పట్టించుకోరు. కానీ కొన్ని ఆహారాలు పరగడుపున తీసుకుంటే ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. 

PREV
15
తాత్కాలిక ఊరటతో అనారోగ్యం

ఉదయం లేవగానే ఏమి తింటున్నామన్నది శరీరంపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కొందరికి మార్నింగ్ మార్నింగ్ బాగా ఆకలివేస్తుంది. లేకపోతే బ్రష్ చేసిన వెంటనే ఏదో ఒకటి తినాలని పరిగెడతారు. అలా ఏది కనిపిస్తే అది కడుపులో వేసేస్తారు. తాత్కాలిక ఊరట కనిపించినా…దీర్ఘకాల ప్రభావం గురించి ఆలోచించరు. ఆ అలవాటే అనారోగ్యానికి దారి తీస్తుంది. 

25
ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు

ముఖ్యంగా ఖాళీ కడుపుతో కొన్ని రకాల ఫ్రూట్స్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కమలాలు, ముసంబి వంటి ఫ్రూట్స్‌లో ఆమ్లం, సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. అరటిపండు కూడా చాలా మంది ఉదయం వెంటనే తింటారు. కానీ ఖాళీ కడుపుతో అరటిపండు తింటే రక్తంలో మాగ్నీషియం స్థాయి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కొందరిలో గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ద్రాక్ష కూడా తినకూడని ఫ్రూట్స్‌లో ఒకటి. సీతాఫలం తింటే కడుపులోని మృదువైన పొరను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే వీటిని భోజనం తర్వాత లేదా తేలికపాటి అల్పాహారం తర్వాత తినడం మంచిది. వీటిని పరగడుపున తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవచ్చు. ఇది శరీరానికి తాత్కాలికంగా ఎనర్జీ ఇచ్చినా తర్వాత అలసటకు దారితీస్తుంది. అలాగే పుల్లటి ఫ్రూట్స్ తీసుకుంటే ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు రావచ్చు.

35
పరగడుపున పాలు తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్

అలాగే చాలా మందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో టీ, కాఫీ తీసుకోవడం వల్ల కడుపులో అసిడిటీ పెరగడం, గ్యాస్, అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదే విధంగా పరగడుపున పాలు తాగడం కూడా కొంతమందికి కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు కారణమవుతుంది. మరికొందరు ఉదయం పాలు తాగితే మంచిదని తాగేస్తారు. స్కూల్ కి వెళ్లే పిల్లలకు ఇస్తారు. కానీ అది మంచిది కాదు. పరగడుపున పాలు తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడుతుంది.

45
వీటిలో ఎక్కువ చక్కెర, ప్రిజర్వేటివ్స్

ఇంకా కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఖాళీ కడుపుతో తినకపోవడం మంచిది. వీటిలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. అంతేకాదు ఇవి జీర్ణక్రియను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

55
ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాలి

అయితే ఉదయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మంచి ఆహారాలు తీసుకోవడం అవసరం. ఉదాహరణకు గోరు వెచ్చని నీళ్లు తాగడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే గ్రీన్ టీ తీసుకోవడం కూడా శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది. బాయిల్డ్ ఎగ్, నానబెట్టిన బాదం, చియా సీడ్స్, నానబెట్టిన మొలకలు వంటి ఆహారాలు ప్రోటీన్లు, పోషకాలు అందించి శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి.

కాబట్టి ఉదయం లేవగానే పనికిరాని చెత్తా చెదారం, ఆరోగ్యమని భావించే ఫుడ్ కు గుడ్ బై చెప్పి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది. సరైన ఆహారపు అలవాట్లు మంచి ఆరోగ్యానికి మొదటి అడుగు. 

Read more Photos on
click me!

Recommended Stories