Hair Growth: ఎక్కువ ఖర్చు లేకుండా జుట్టు అందంగా పెరగాలా? ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తింటే చాలు

Published : Mar 05, 2026, 05:04 PM IST

Hair Growth: జుట్టు ఆరోగ్యానికి పోషకాహారం అవసరం. చాలా మంది హెయిర్ గ్రోత్ కోసం హైలీ రిచ్ ఫుడ్ తినాలని భావిస్తారు. నిజానికి జుట్టు పెరుగుదలకు భారీా ఖర్చుతో పని లేదు. అందుబాటులో దొరికే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారంలో కావలసినంత పోషకాలు ఉంటాయి. 

PREV
16
తక్కువ ఖర్చులో దొరికే హెల్దీ పుడ్

మెరిసే జుట్టు, ఒత్తైన కురులు అందరికీ కావాలి. కానీ ఇప్పుడున్న పొల్యుషన్, జీవనశైలికి అది కాస్త కష్టమే. పెరగడం పక్కనపెడితే ఉన్న జుట్టే ఊడిపోతోంది. దీనికోసం బోల్డెంత ఖర్చు పెట్టి ఏవేవో తింటుంటారు. అలా కాకుండా తక్కువ ఖర్చులో దొరికే హెల్దీ పుడ్ ఏంటో తెలుసా? 

26
చియాకు ప్రత్యమ్నాయం సబ్జా గింజలు

ఉదాహరణకు చాలా మంది చియా సీడ్స్ ను హెయిర్ గ్రోత్ కోసం ఉపయోగిస్తారు. అయితే దీనికి మంచి ప్రత్యామ్నాయం సబ్జా గింజలు. ఇవి కూడా పోషకాలతో నిండి ఉండి జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి.

36
ఇంట్లోనే ఉందిగా పెరుగు

గ్రీక్ యోగర్ట్ చాలా ఖరీదైనది. దీనికి బదులుగా మన ఇంట్లోనే తయారు చేసే పెరుగు మంచిది. ఇందులో ఉండే ప్రోటీన్లు, ప్రోబయోటిక్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

46
మునగకాయలో విటమిన్లు, మినరల్స్

హెయిర్ గ్రోత్ కోసం చాలా మంది బ్రోకోలీ తినాలని సూచిస్తారు. కానీ మనకు సులభంగా దొరికే మునగకాయలోనూ అంతే పోషకాలు ఉంటాయి. ఇది విటమిన్లు, మినరల్స్ తో నిండి ఉండి జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది.

56
బొప్పాయిలో పోషకాలు పుష్కలం

అలాగే ఖరీదైన బ్లూబెరీస్ కు బదులు జామ పండు మంచి ఎంపిక. జామలో విటమిన్ C ఎక్కువగా ఉండి జుట్టు రూట్స్ బలపడటానికి సహాయపడుతుంది. అవకాడో కాకుండా అరటిపండు తీసుకోవచ్చు. దీంట్లో పొటాషియం, పోషకాలు పుష్కలంగా ఉండి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

స్ట్రాబెరీస్ పక్కనపెట్టి బొప్పాయి లేదా ఆరెంజ్ తినొచ్చు. వీటిలో ఉండే విటమిన్లు జుట్టు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి.

66
క్వినోవాకి ఆల్టర్ నేటివ్ రాగి

ఇంకా క్వినోవాకి ఆల్టర్ నేటివ్ రాగి. సోడిపిండిలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే మాకడామియా నట్స్ స్థానంలో బాదం బెస్ట్.

హెయిర్ గ్రోత్ కోసం ఖరీదైన విదేశీ ఆహారాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మనకు అందుబాటులో ఉండే లోకల్ ఆహారాలు కూడా అదే స్థాయిలో పోషకాలు అందించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవు. సరైన ఆహారం, మంచి జీవనశైలి ఉంటే జుట్టు సహజంగా ఆరోగ్యంగా పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories