చాలా మంది జిమ్ చేస్తే కండలు తిరిగే శరీరాన్ని సంపాదించొచ్చని అనుకుంటారు. కాని కేవలం ఎక్సర్ సైజ్ చేస్తే సరిపోదు. కసరత్తులకు తగ్గ ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే జిమ్ లో ఎలా పడితే అలా ఎక్సర్ సైజ్ చేసినా మీరు బలాన్ని పొందలేరు. దీనికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. జిమ్ చేసే వారు కచ్చితంగా ఫాలో అయ్యే రూల్ ఏంటంటే.. అదే 3-3-3 రూల్. ఈ రూల్ గురించి వివరంగా తెలుసుకుందామా?
3-3-3 రూల్ జిమ్ వర్కౌట్
3-3-3 వర్కౌట్ అంటే ప్రతి రోజు 3 వ్యాయామాలను 3 సార్లు చేయడం, 3 రౌండ్లు చేయడం. ఉదాహరణకు ఉదాహరణకు కింది శరీరాన్ని మెరుగుపరిచే స్క్వాట్ వ్యాయామాలు, పై శరీరాన్ని మెరుగుపరిచే పుష్-అప్‌లు, మధ్య కండరాలను బలోపేతం చేసే ప్లాంక్స్ వంటివి వరుసగా మొత్తం 3 రౌండ్లు (3 సెట్లు) చేయాలి. ఇలాగే వేర్వేరు కండరాల కోసం 3 వ్యాయామాలను ప్లాన్ చేసుకుని చేయవచ్చు.
ఇది కూడా చదవండి మనసులో బాధ ఉన్నా నవ్వుతూ మాట్లాడుతున్నారా? ఇది ఎంత పెద్ద సమస్యో తెలుసా?
పురుషులు, స్త్రీలకు కూడా మంచిదే
ఈ 3-3-3 రూల్ కేవలం పురుషులకే కాదు. స్త్రీలకు కూడా మంచిదే. ప్రతి సెట్‌కి శరీరంలోని వేర్వేరు కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. 3 వ్యాయామాలను ఒక్కోటి 3 సార్లు చేయాలి. రెగ్యులర్ గా 3-3-3 రూల్ పాటిస్తూ మీ శరీరంలో ఒక్కో భాగాన్ని స్ట్రాంగ్ చేసుకోవచ్చు. అంటే సోమవారం ఛెస్ట్ (ఛాతీ) భాగాన్ని బలోపేతం చేసే వ్యాయామాలు ఎక్కువ చేయాలి. మంగళవారం శరీరంలోని మధ్య కండరాలను స్ట్రాంగ్ చేసే వ్యాయామాలు ఎక్కువ చేయాలి. బుధవారం కాళ్లు, చేతులను స్ట్రాంగ్ చేసేలా ఎక్కువ కసరత్తులు చేయాలి. ఇలా 3-3-3 రూల్ ఫాలో అవుతూనే రోజుకో భాగానికి చెందిన ఎక్సర్‌సైజ్ లు ఎక్కువగా చేయాలి.
శరీరం మొత్తానికి బలం
ఈ 3-3-3 రూల్ ను మీరు ఇంట్లో కూడా ఫాలో అవ్వచ్చు. మీ శరీరాన్ని మూడు భాగాలుగా కేటగిరీ చేసుకొని రోజుకో భాగాన్ని బలోపేతం చేసేలా ఎక్సర్ సైజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది. అంతేకాకుండా మీ శరీరంలోని అన్ని భాగాలు సమాన బలాన్ని పొందుతాయి. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు ఉంటే మీకు విటమిన్ కె లోపం ఉన్నట్టే