brain health
5 Brain exercises to improve your memory: ధ్యానం
ధ్యానం ప్రశాంతతతో పాటు మీకు మానసికంగా సమతుల్యతను అందిస్తుంది. భావోద్వేగాలను కంట్రోల్ లో ఉంచడంతో పాటు మొత్తంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మెదడుతో పాటు శరీరానికి కూడా అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ధ్యానం చేయడం వల్ల మెదడు పనితీరు మెగురు పడుతుంది.
5 Brain exercises to improve your memory
జిగ్సా పజిల్స్
జిగ్సా పజిల్స్‌కు విభిన్న అభిజ్ఞా సామర్థ్యాలు అవసరం. జిగ్సా పజిల్‌ను అసెంబుల్ చేసేటప్పుడు, మీరు ప్రతి భాగాన్ని పరిశీలించి, అది పెద్ద చిత్రంలో ఎక్కడ సరిపోతుందో నిర్ణయించాలి. ఇది మీ మెదడును పరీక్షించడానికి.. ఒక రకంగా మెదడు వ్యాయామం చేసే పని. కాబట్టి జిగ్సా పజిల్స్ తో మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
5 Brain exercises to improve your memory
క్రాస్‌వర్డ్ పజిల్స్
కంప్యూటరైజ్డ్ క్రాస్‌వర్డ్ పజిల్స్ తో కూడా మీ మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న రోగులలో అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. అనేక అధ్యయనాల ప్రకారం, కంప్యూటర్ గేమ్‌ల కంటే క్రాస్‌వర్డ్ పజిల్స్ మెదడుకు మరింత ఉపయోగకరంగా ఉంటాయి.
5 Brain exercises to improve your memory
చదరంగం
వృద్ధులకు జ్ఞాపకశక్తి క్షీణతను నివారించడంలో చదరంగం సహాయపడవచ్చు. అయితే, ఇప్పటికే చిత్తవైకల్యం లేదా అభిజ్ఞా క్షీణతకు కారణమయ్యే ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది పెద్దగా సహాయపడకపోవచ్చు. అయితే, అన్ని వయస్సుల వారికి చదరంగంతో మెదడు పనితీరు మెరుగుపడుతుందనీ, జ్ఞాపకశక్తిని పెంచుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
5 Brain exercises to improve your memory
సుడోకు
సుడోకు వంటి సంఖ్యా పజిల్స్ మెదడుకు వ్యాయామం చేయడానికి ఒక ఆహ్లాదకరమైన పద్ధతి. కొంతమందిలో అభిజ్ఞా పనితీరును కూడా పెంచవచ్చు. సుడోకుతో మెదడు పనితీరు మెరుగై జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.