Immunity Booster : మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. సహాయపడే ఆయుర్వేద మూలికలు!

Published : Jul 08, 2025, 11:45 AM IST

Immunity Booster: వివిధ వ్యాధుల నుండి మానవ శరీరాన్ని రక్షించడంలో ఆయుర్వేద ఔషధ మూలికలు, సుగంధ ద్రవ్యాలు సహాయపడతాయి. అయితే, రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించడంలో సహాయపడే మూడు మూలికల గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్ గౌతమ్ వివరించారు.

PREV
15
రక్షించే ఆయుర్వేద మూలికలు

ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న ఒత్తిడులు, కాలుష్యం, అసమతుల్యమైన జీవనశైలి కారణంగా ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎవరికైనా ఎప్పుడు ఏ రోగం వస్తుందో ముందుగా ఊహించడం కష్టమే. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు ప్రకృతి సహజమైన మార్గాలను అనుసరించడమే ఉత్తమం. మన పూర్వీకులు చెప్పిన ఆయుర్వేద మూలికలు ఈ విషయంలో ఉపయోగపడుతాయి. 

ఈ మూలికలు శరీరానికి సహజ బలాన్ని అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతూ, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై ఇవి మంచి ప్రభావం చూపుతాయి. కడుపు పూతలు, అజీర్తి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆ మూలికలు ఇవే..

25
త్రిఫల చూర్ణం

త్రిఫల చూర్ణం.. అద్భుతమైన  ఔషధ గుణాలున్న మిశ్రమం. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయల నుంచి  విత్తనాలను తీసి బాగా ఆరబెట్టి, వాటిని పొడి చేస్తే అదే త్రిఫల చూర్ణం. ఇది చాలా శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం. ఇది ఆయుర్వేద దుకాణాల్లో ఈ చూర్ణం సులభంగా లభిస్తుంది. 

త్రిఫలను ప్రతిరోజూ ఒక స్పూన్ చొప్పున వేడి నీటితో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా  ఇది కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్ధకం తగ్గించి, శరీరాన్ని సహజంగా శుద్ధి చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. దీని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి.

35
కరుంకాలి

ఇటీవల కరుంకాలి అనే చెట్టు గురించి ఇంటర్నెట్‌లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దీని చెక్కతో తయారైన కరుంకాలి మాల వైరల్ అయింది. మెడలో ఈ మాలను ధరిస్తే ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని, చెడు శక్తులు దూరంగా వెళ్లిపోతాయని నమ్ముతాయి. ఇది కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. కరుంకాలి చెక్కలో ఉన్న సహజ సుగంధ ద్రవ్యాలు, తేమనిచ్చే లక్షణాలు శరీరాన్ని శాంతంగా ఉంచుతాయి. ఈ మాల ధారణ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగే శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం వంటి ప్రయోజనాలూ ఉన్నాయి. 

45
వేగి చెట్టు

వేగి చెట్టు మన పూర్వీకుల ఆచారాల్లో, ఆరోగ్య సంరక్షణలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఈ చెట్టు దృష్టి దోషాన్ని నివారించే శక్తిని కలిగి ఉందని నమ్మకం. అందుకే పూర్వకాలంలో ఇంటి గుమ్మం దగ్గర వేగి చెట్టును కట్టి ఉంచే సంప్రదాయం ఉండేది. ఇది కేవలం ఆధ్యాత్మిక పరిరక్షణకే కాదు, ఆరోగ్య పరంగా కూడా ఎంతో ఉపయోగకరమైన మొక్క.

వేగి చెట్టుకు విష నివారణ గుణం ఉంది. కీటకాల కాటు వల్ల వచ్చే సమస్యలకు దీనిని ప్రాచీనకాలంలో ఔషధంగా వాడేవారు. దీని ప్రత్యేకమైన వాసన కీటకాలను దగ్గరికి రాకుండా చేస్తుంది. ఇది సహజ రీపెల్లెంట్‌గాను పనిచేస్తుంది. వేగి చెట్టు బెరడును ఆరబెట్టి పొడి చేసి ఉపయోగిస్తే జుట్టు రాలడం, తెల్లజుట్టు వంటి సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా ఇది పేగు సంబంధిత సమస్యలకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.

55
తయారీ విధానం

త్రిఫల చూర్ణం, కరుంకాలి చెక్క పొడి, వేగి చెట్టు బెరడుపొడి.. ఈ మూడు మూలికల్ని సమాన భాగాలుగా తీసుకోవాలి. మూడు గ్రాముల చొప్పున పొడి తీసుకుని, ఒక పాత్రలో 350 మి.లీ. నీరు పోసి మరిగించాలి. నీరు సుమారు 100 మి.లీ. మిగిలేంత వరకు మరిగించాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. ఇలా సిద్ధమైన కషాయాన్ని ఉదయం భోజనానికి ముందు ఒకసారి, రాత్రి భోజనానికి ముందు ఒకసారి తాగాలి. ఇది తీసుకునే సరైన సమయం. చేదుగా అనిపిస్తే కొద్దిగా పటిక బెల్లం కలిపుకోవచ్చు. 

గమనిక: పై సమాచారమంతా ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్ గౌతమ్ విడుదల చేసిన వీడియో ఆధారంగా అందించబడింది. ఇది కేవలం సాధారణ ఆరోగ్య సమాచారం కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి శరీర పరిస్థితులు, వైద్యపరమైన అవసరాలు వేర్వేరుగా ఉండే అవకాశముంది. అందువల్ల ఏదైనా మందు లేదా చికిత్స ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి. వైద్యుడి సలహా లేకుండా స్వయంగా చికిత్స చేసుకోకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories