Immunity Power: మీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గితే ఈ లక్షణాలు కనిపిస్తాయి..
Immunity Power: తరచుగా జలుబు చేయడం, గాయం తొందరగా మానకపోవడం, ఇన్ఫెక్షన్లకు గురి కావడం, ఒత్తిడి, ఎప్పుుడూ నీరసంగా కనిపించడం వంటి లక్షనాలు కనిపిస్తే మీలో రోగనిరోధక శక్తి తగ్గిందని అర్థం చేసుకోవాలి.
- FB
- TW
- Linkdin
Follow Us

Immunity Power: మన శరీరంలో అనేక రోగాల నుంచి తప్పించుకోవాలన్నా.. వాటి నుంచి తొందరగా బయటపడాలన్నా రోగ నిరోధకత వ్యవస్థ బాగుండాలి. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నప్పుడే మనకు ఎలాంటి జబ్బులు సోకే అవకాశం ఉంది. మన ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి మనం తీసుకునే ఆహారం, చెడు జీవన శైలి, నిద్రలేమి వంటివి కారణాలుగా చెప్పొచ్చు. మనలో చాలా మందికి రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఈ విషయం వారికి తెలియకపోవచ్చు. అయితే కొన్ని లక్షణాల ద్వారా మీ ఇమ్యూనిటీ తగ్గిందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అవేంటంటే..
ఒత్తిడి.. చిన్న చిన్న పనులకు కూడా మీరు అలసిపోతున్నారా? అలాగే ఇంట్లో చిన్న గొడవ జరిగినా మీరు దాన్ని భరించలేక ఒత్తిడికి గురవుతున్నారా? అయితే మీకు ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును చిన్న వాటికి కూడా మీరు ఇర్రటేట్ అవుతూ ఒత్తిడిగా ఫీలైతే మీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిందనే అర్థం చేసుకోవాలి. American Psychological Association నివేదిక ప్రకారం.. మీరు దీర్ఘకాలం పాటు ఒత్తిడికి గురైతే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ పూర్తిగా బలహీనపడుతుందని వెళ్లడైంది.
తరచుగా జలుబు చేయడం.. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే కూడా తరచుగా జలుబు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. నెల నెలా జలుబు చేయడం లేదా రెండు మూడు నెలలకోసారి జలుబు చేస్తే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి.
పొట్ట సమస్యలు.. తిన్నా.. తినకపోయినా కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటివి తరచుగా వస్తుంటే మీకు ఇమ్యూనిటీ లోపించిందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జీర్ణవ్యవస్థ 70 శాతం ఇమ్యూనిటీ శక్తితోనే పనిచేస్తుంది కాబట్టి.
గాయం తొందరగా మానకపోవడం.. మీకు ఏదైనా దెబ్బతగిలినప్పుడు అది మానడానికి చాలా సమయం పడితే మీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిందని మీరు బలహీనంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే .. ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగ్గా ఉన్నప్పుడే గాయం అయిన చోట కొత్త చర్మం తొందరగా ఉత్పత్తి అవుతుంది. దీని పనితీరు మందగిస్తేనే గాయం తొందరగా మానదు.
నీరసం.. లేచిన వెంటనే నీరసంగా అనిపించడం, ఏ పని చేసినా.. చేయకపోయినా గానీ అలసటగా ఫీలవడం మీరు బలహీనంగా ఉన్నారని తెలియజేస్తుంది. బలహీనంగా ఉండటానికి కారణం మీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడమే.
తరచూ ఇన్ఫెక్షన్ కు గురికావడం.. ఇమ్యూనిటీ పవర్ తగ్గితే మీరు తరచుగా నిమోనియా, సైనస్, చెవి ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు.
ఇమ్యూనిటీ పెరగాలంటే.. క్యారెట్, గుడ్లు, పాలు, బీట్ రూట్, వెల్లుల్లి, అల్లం, మజ్జిగ, పెరుగు, పాలకూర, నట్స్, ఆకు కూరలు, చికెన్, కాకరకాయ, చేపలు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. నిత్యం వీటిని తింటే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆహారంతో పాటుగా కంటినిండా నిద్రపోతేనే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ముఖ్యంగా ఒత్తిడి లేకుండా ఉండాలి. అప్పుడే మీ ఆరోగ్యం బావుంటుంది.