Skin Care Tips: మచ్చలేని, మెరిసే చర్మం కోసం.. రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి!

Published : Jul 08, 2025, 08:51 AM IST

Skin Care : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది ఫేస్ క్రీమ్స్, లోషన్స్, సోప్స్ వాడుతుంటారు. అది ఖరీదైనవే కాదు..హానికరమైనవి కూడా. సహజంగా ముఖం అందంగా కనిపించాలంటే.. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ చిట్కాలు పాటించండి. 

PREV
16
మెరిసే ముఖం కోసం

అందంగా కనబడాలని ప్రతి ఒక్కరి కోరుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది తమ అందాన్ని, ముఖారవిందాన్ని మెరుగు పరుచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అనేక రకాల కెమికల్ ఉత్పత్తులను వాడుతుంటారు. అవి చాలా ఖరీదైనవే కాకుండా, కొన్ని సార్లు చర్మ సమస్యలకూ కారణమవుతాయి. వాటికి బదులుగా సహజంగా ఇంట్లోనే ఉన్న సాధారణ పదార్థాలతో ముఖాన్ని అందంగా మార్చుకోగలమని మీకు తెలుసా? ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు కింది ఇచ్చిన సహజ పదార్థాల్లో ఏదొకటి ముఖానికి రాస్తే, ఉదయం మీ ముఖాన్ని చూసుకుని మీరే ఆశ్చర్యపోతారు. ఆ స్కీన్ కేర్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం..

26
బాదం నూనె:

సాధారణంగా జుట్టు పెరుగుదలకు బాదం నూనెను ఉపయోగిస్తారు. కానీ ముఖం అందంగా, మృదువుగా మారడానికి కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను ముఖానికి రాసి, మృదువుగా మసాజ్ చేస్తే చర్మానికి పోషణ లభిస్తుంది. ముఖం మెరుస్తుంది. తక్కువ రోజుల్లోనే ముఖం మృదువుగా మారడం చూడవచ్చు.

36
కలబంద జెల్:

కలబంద జెల్ జుట్టుకే కాదు, ముఖ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి కలబంద జెల్ రాసి మెల్లగా మసాజ్ చేయండి. మరుసటి రోజు ఉదయం మీ ముఖం తేజస్సుతో మెరిసిపోతుంది. దీన్ని క్రమం తప్పకుండా వాడితే చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది. అయితే, మార్కెట్‌లో దొరికే జెల్‌కి బదులుగా పెరటిలో పెంచుకునే కలబందను వాడటం మంచిది.

46
పెరుగు:

పెరుగు  చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేసే  ఔషధం. పెరుగులోని కాల్షియం, విటమిన్లు కేవలం పేగులకు మాత్రమే కాదు, ముఖ చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రాత్రి పెరుగుతో ముఖానికి మసాజ్ చేసి, కాసేపు వదిలేయండి. ఆపై కడిగేస్తే చర్మం మృదువుగా, మెరిసేలా మారుతుంది. క్రమం తప్పకుండా వాడితే ముఖం కాంతివంతంగా మారుతుంది.

56
పాలు:

పచ్చి పాలు సహజ టోనర్‌గా పనిచేస్తాయి. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంలోని మలినాలను తొలగించి, మెలానిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని వలన చర్మం నిగారింపుగా, ప్రకాశవంతంగా మారుతుంది. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు పచ్చి పాలను ముఖానికి రాసి, కాసేపటి తరువాత క్లీన్ చేస్తే.. ముఖం మెరిసిపోతుంది.  క్రమం తప్పకుండా చేస్తే చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

66
రోజ్ వాటర్, చందనం

గులాబీ నీరు ( రోజ్ వాటర్)  చర్మానికి తేమను అందిస్తూ, ప్రకాశవంతంగా మార్చుతుంది. చందనం చర్మాన్ని శుభ్రపరిచి ప్రకాశవంతంగా మారుస్తుంది. ఈ రెండింటినీ కలిపి ఫేస్ ప్యాక్‌గా ముఖానికి వేసి 15 నిమిషాల తర్వాత కడిగితే, ముఖానికి సహజ మెరుపు వస్తుంది. క్రమం తప్పకుండా వాడితే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories