అవోకాడో లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకునేవారు విటమిన్ కె తీసుకోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా తీసుకోకుండా ఇలాంటి ఆహారం తీసుకోవడం మంచిది కాదు.
జీర్ణ సమస్యలు ఉన్నవారు
అవోకాడోలో ఫైబర్ , కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది కొంతమందిలో విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ పండును నివారించడం మంచిది.
లాటెక్స్ అలెర్జీ ఉన్నవారు
లాటెక్స్‌కు అలెర్జీ ఉన్నవారు ఈ పండును తినడం మానేయాలి. లాటెక్స్ అనేది సహజ రబ్బరు (రబ్బరు పాలు) నుంచి వచ్చే ఒక పదార్థం, దీనిని చేతి తొడుగులు, బెలూన్లు, మెట్రెస్‌ల వంటి ఉత్పత్తులలో వాడతారు. కొందరిలో, లాటెక్స్‌కు గురికావడం వల్ల లాటెక్స్ అలెర్జీ వస్తుంది. ఈ అవకాడో తినడం వల్ల కూడా ఇలాంటి అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి... అలాంటివారు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.