ఓట్స్ మంచి హెల్తీ ఫుడ్. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యంగా ఉండటం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అయితే ఓట్స్ ను మనం రోటీ చేసుకుని కూడా తినొచ్చు. దీనివల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గుతారు
బరువు తగ్గాలనుకునేవారు ఓట్స్ రోటీని తింటే చాలా మంచిది. దీనిలో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. మీరు గనుక ఓట్స్ రోటీని తింటే కడుపు తొందరగా నిండుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. అలాగే ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి. ఇది మీరు బరువు తగ్గడానికి, బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి బాగా సహాయపడుతుంది.