Weight Loss: నల్ల మిరియాలు జీవక్రియను పెంచి, కొవ్వు కణాలను నిరోధించి, ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. డిటాక్స్ డ్రింక్స్, గ్రీన్ టీ లేదా పెరుగులో కలిపి తీసుకోవచ్చు.
నల్ల మిరియాలను మనం ఎక్కువగా వంటల్లోనే ఉపయోగిస్తాం. దీని ఘాటైన వాసన, రుచి ఫుడ్ టేస్ట్ ను బాగా పెంచుతాయి. అంతేకాదు వీటిలో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా నల్ల మిరియాలు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. మరి ఇవి బరువు తగ్గడానికి ఎలా సహాయపడతాయి? ఇందుకోసం మిరియాలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
25
బరువు తగ్గడానికి నల్ల మిరియాలు ఎలా సహాయపడతాయి?
జీవక్రియ పెరుగుతుంది
నల్ల మిరియాలు జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. దీంతో మన శరీరంలో కేలరీలు మరింత ఫాస్ట్ గా బర్న్ అవుతాయి. శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తే మనం తొందరగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.
కొత్త కొవ్వు ఏర్పడదు
మిరియాలు కొత్త కొవ్వు కణాలు ఏర్పడటాన్ని నిరోధిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంటే మీరు దీనివల్ల బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. అంతేకాదు మిరియాలు జీర్ణక్రియను మెరుగుపర్చడానికి కూడా సహాయపడతాయి. ఇవి జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేసి మన శరీరం పోషకాలను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. అలాగే వ్యవర్థ పదార్థాలు బయటకు పోవడానికి సహాయపడుతుంది.
35
ఆకలి నియంత్రణ
నల్ల మిరియాల్లోని పైపెరిన్ ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల మీరు తక్కువగా తింటారు. అలాగే అనవసరమైన ఆహారాలకు దూరంగా ఉంటారు. దీనివల్ల మీరు హెల్తీగా బరువు తగ్గుతారు.
నల్లమిరియాలను మార్నింగ్ డిటాక్స్ డ్రింక్ గా తాగినా కూడా మీరు బరువు తగ్గుతారు. ఇందుకోసం గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో సగం టీ స్పూన్ నల్లమిరియాల పొడి, టీస్పూన్ తేనెను మిక్స్ చేసి కలిపి తాగండి. దీన్ని పరిగడుపున తాగాలి. ఇది జీవక్రియను పెంచి శరీరంలోని బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
55
గ్రీన్ టీతో
మీరు నల్ల మిరియాలను గ్రీన్ టీతో పాటుగా తాగొచ్చు. ఇందుకోసం గ్రీన్ టీలో చిటికెడు నల్లమిరియాల పొడిని వేసి కలిపి తాగండి. ఈ రెండూ కలిసి మీ జీవక్ియను పెంచడానికి సహాయపడతాయి. అలాగే మీరు దీన్ని పెరుగుతో కూడా తినొచ్చు. ఇందుకోసం కప్పు పెరుగులో నల్లమిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడిని వేసి కలిపి తినండి.
దీనివల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అయితే నల్ల మిరియాల వల్ల బరువు తగ్గినా వీటిని మాత్రం ఎక్కువగా తినకూడదు. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే బరువు తగ్గడానికి కేవలం మిరియాల మీదే ఆధారపడకూడదు. మంచి హెల్తీ ఫుడ్ ను తింటూ రోజూ ఎక్సర్ సైజ్ చేయాలి.