Chicken: చికెన్‌ని వండేముందు కడుగుతున్నారా? ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి

Published : Jan 31, 2026, 03:44 PM IST

చికెన్ ని వండేముందు నీటితో కడగాలా? లేక కడగకుండా నేరుగా వండితేనే మంచిదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. కడిగితే చికెన్ నీట్ గా ఉంటుందని కొందరు, కడగడం మంచిది కాదని మరికొందరు చెబుతుంటారు. కానీ ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
చికెన్ ని వండేముందు కడిగితే ఏమవుతుంది?

చాలామంది చికెన్ వండేముందు తప్పకుండా నీటితో కడగాలి అనుకుంటారు. కడిగితే మురికి పోతుంది, బ్యాక్టీరియా తొలగిపోతుంది అనుకుంటారు. కానీ నిపుణులు మాత్రం దీనిపై భిన్నమైన అభిప్రాయం చెబుతున్నారు. మరి చికెన్‌ను వండేముందు కడగడం నిజంగా మంచిదా? లేక ఆరోగ్యానికి ప్రమాదమా? ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

26
హానికరమైన బ్యాక్టీరియా

ఆరోగ్య నిపుణుల ప్రకారం, పచ్చి చికెన్‌లో సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. చికెన్ ని నీటితో కడగడం వల్ల ఈ బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోదు. నిజానికి, కడిగే సమయంలో నీటి చుక్కల ద్వారా ఈ బ్యాక్టీరియా వంటగదిలోని సింక్, కౌంటర్, పాత్రలు, ఇతర కూరగాయలపైకి వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే చికెన్‌ని కడగడం వల్ల బ్యాక్టీరియా పోవడం కాదు, మరింతగా వ్యాపించే అవకాశం ఉంది.

36
ఆహార పదార్థాల కలుషితం

చికెన్ మీద ఉన్న బ్యాక్టీరియా వల్ల మనకు తెలియకుండానే వంటగదిలోని ఇతర ఆహార పదార్థాలు కలుషితం కావచ్చు. ముఖ్యంగా సలాడ్లు, పచ్చి కూరగాయలు, వండకుండా నేరుగా తినే ఆహారాలకు ఇది ప్రమాదకరం. ఇలా కలుషితమైన ఆహారం తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

46
పోషక విలువలు తగ్గే అవకాశం

చికెన్‌ను ఎక్కువసేపు నీటిలో కడగడం వల్ల దాని సహజ రుచి, టెక్స్చర్ కొంత మారే అవకాశం ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం, నీటిలో ఎక్కువసేపు ఉంచడం వల్ల చికెన్‌లోని పోషక విలువలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్ల నిర్మాణం కొద్దిగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

56
చికెన్ ని కడగకపోతే?

చికెన్‌ని కడగకపోతే ఏమవుతుంది అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం, చికెన్‌ను కడగకుండా నేరుగా సరైన ఉష్ణోగ్రతలో వండితే, అందులోని హానికరమైన బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. సాధారణంగా చికెన్ పూర్తిగా ఉడికేంతవరకు వండితే బ్యాక్టీరియా బతికే అవకాశం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

66
శుభ్రత పాటించడం అవసరం

చికెన్‌ని కడగకపోయినా, శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. చికెన్‌ను తాకిన తర్వాత చేతులు సబ్బుతో బాగా కడుక్కోవాలి. అలాగే చికెన్ కట్ చేసిన బోర్డు, కత్తి, పాత్రలను వెంటనే శుభ్రం చేయాలి. వండిన చికెన్, పచ్చి చికెన్‌ను వేర్వేరు పాత్రల్లో ఉంచాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories