Honey Facts: 100 ఏళ్లయినా తేనె ఎందుకు పాడవ్వదు.? ఇందులో ఉన్న సైంటిఫిక్ కారణాలు ఏంటో తెలుసా.?

Published : Jan 30, 2026, 11:52 AM IST

Honey Facts: ప్ర‌కృతి మ‌న‌కు అందించిన అద్భుతాల్లో తేనె ఒక‌టి. ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉండే తేనెలో మ‌రెన్నో ఆస‌క్తిక‌ర గుణాలు ఉంటాయి. వీటిలో ఒక‌టి తేనెకు ఎక్స్పైరీ తేదీ లేక‌పోవ‌డం. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
15
తేనె నిజంగానే ఎప్పటికీ పాడవదా?

తేనెను చాలామంది “ప్రకృతి ఇచ్చిన అమర ఆహారం” అని అంటుంటారు. వేల ఏళ్ల క్రితం ఈజిప్ట్ సమాధుల్లో దొరికిన తేనె ఇప్పటికీ తినడానికి బాగా ఉంద‌ని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పుడు సహజంగా వచ్చే ప్రశ్న ఒక్కటే… తేనె అసలు ఎప్పుడూ పాడవదా? లేక ఇది కేవలం కథ మాత్రమేనా? అయితే ఇది నిజంగా నిజ‌మే. తేనెకు ఎక్స్పైరీ డేట్ ఉండ‌దు. దీనికి వెనుక స్పష్టమైన సైన్స్ ఉంది.

25
తేనెలో నీరు చాలా తక్కువగా ఉండటం

తేనెలో నీటి శాతం కేవలం 17 నుంచి 18 శాతం మాత్రమే ఉంటుంది. బ్యాక్టీరియా, ఫంగస్, సూక్ష్మజీవులు పెరగాలంటే ఎక్కువ నీరు అవసరం. తేనెలో నీరు చాలా తక్కువగా ఉండటం వల్ల ఆ సూక్ష్మజీవులు బ్రతకలేవు. అందుకే తేనె చాలా కాలం భద్రంగా ఉంటుంది.

35
తేనె ఆమ్ల గుణం కూడా రక్షణగా పనిచేస్తుంది

తేనె pH విలువ 3.2 నుంచి 4.5 మధ్య ఉంటుంది. అంటే ఇది స్వల్పంగా ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. ఈ ఆమ్ల గుణం చాలా రకాల బ్యాక్టీరియాను నాశనం చేయడంలో లేదా వాటి పెరుగుదలను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. సహజంగానే ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

45
తేనెలో ఉండే ప్రత్యేక ఎంజైమ్ పాత్ర

తేనెటీగలు పూలలోని తీపి రసాన్ని సేకరించిన తర్వాత దానిని తేనెగా మార్చే సమయంలో “గ్లూకోజ్ ఆక్సిడేజ్” అనే ఎంజైమ్‌ను కలుపుతాయి. ఈ ఎంజైమ్ కారణంగా తేనెలో నెమ్మదిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ తయారవుతుంది. ఇది తేనెకు స్వల్ప యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ లక్షణాలను ఇస్తుంది.

55
చక్కెర ఎక్కువగా ఉండటం మరో రహస్యం

తేనెలో సహజ చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చక్కెర బ్యాక్టీరియా కణాల్లోని నీటిని బయటకు లాగేస్తుంది. దీనిని “ఆస్మోసిస్” అంటారు. ఫలితంగా బ్యాక్టీరియా ఎండిపోయి పెరిగేలోపే నశించిపోతుంది. ఎయిర్‌టైట్ డబ్బాలో ఉంచిన స్వచ్ఛమైన తేనె వేల సంవత్సరాల పాటు నిల్వ ఉండగలదు. కాలక్రమంలో తేనె గట్టిపడినా లేదా రంగు మారినా అది పాడయిందని అర్థం కాదు. మెల్లగా వేడి చేస్తే మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories