Best Breakfast: ఆరోగ్యంగా ఉండాలంటే.. బ్రేక్ ఫాస్ట్ లో ఏం తినాలి?

Published : Jan 26, 2026, 05:59 PM IST

Best Breakfast: మనం రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా, మన మెదడు చురుకుగా పనిచేయాలన్నా ఉదయం తీసుకునే అల్పాహారం అత్యంత కీలకం. ముఖ్యంగా కొన్ని రకాల బ్రేక్ ఫాస్ట్ లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. 

PREV
13
Break Fast

చాలా మంది ఉదయం పూట హడావిడిగా ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. ఉదయంపూట తినే బ్రేక్ ఫాస్ట్ కి ఎక్కువ ప్రయార్టీ ఇవ్వరు. కొందరేమో.. రుచి తప్ప ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టరు. పూరీ, మసాలా దోశ, వడ , బ్రెడ్ జామ్ లాంటివి తింటూ ఉంటారు. నిజానికి, అల్పహారంగా ఏది తింటే ఆరోగ్యంగా ఉంటామో చాలా మందికి తెలీదు. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. పిండి పదార్థాలు తక్కువగా ఉండి, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే అల్పాహారాలే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.మరి, అలాంటి బ్రేక్ ఫాస్ట్ లు ఏంటో చూద్దాం...

23
పెసరట్టు

...

ది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లలో పెసరట్టు ముందు వరసలో ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలని అనుకునే వారికి కూడా పెసరట్టు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే.. ఈ పెసరట్టును పెసలతో తయారు చేస్తారు. దీని వల్ల మన శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు.. సులభంగా జీర్ణమౌతాయి. శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. ఉదయాన్నే ఈ పెసరట్టు తినడం వల్ల శరీరంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. బరువు తగ్గాలి అనుకునేవారు ఒకటి లేదా రెండుకు మించి తినకూడదు.

33
2. ఇడ్లీ సాంబార్ ...

మనలో చాలా మంది ప్రతిరోజూ ఇడ్లీ తింటారు. అయితే.. ఎక్కువగా చట్నీలతో తింటూ ఉంటారు. అలా కాకుండా.. సాంబార్ తో తింటే చాలా హెల్దీ. అయితే.. ఆ సాంబార్ లో కూరగాయల ముక్కలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వాటితో సహా తిన్నప్పుడు మాత్రమే అది ఆరోగ్యకరం అని గుర్తుంచుకోండి. బరువు తగ్గాలి అనునేవారు సాంబార్ తో రెండు ఇడ్లీలు మాత్రమే తినడం మంచిది. ఇడ్లీని సాంబార్ తో పాటు తీసుకోవడం వల్ల సాంబార్‌లోని కూరగాయలు శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్లను అందిస్తాయి. ఇది పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది.

3. మిల్లెట్ దోశ (Millet Dosa)

సాధారణ బియ్యం దోశ కంటే చిరుధాన్యాలతో (రాగులు, జొన్నలు, సజ్జలు) చేసిన దోశలు ఆరోగ్యానికి ఎంతో మేలు.

మిల్లెట్స్‌లో పోషక విలువలు చాలా ఎక్కువ. ఇవి బరువు తగ్గడానికి , గుండె ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి.

4. బేసిన్ చీలా (Besan Chilla)

శనగపిండితో చేసే ఈ బేసిన్ చీలా ఉత్తర భారతదేశంలో చాలా ప్రసిద్ధి. ఇది తక్కువ సమయంలో తయారయ్యే పోషక ఆహారం. ఇందులో ఐరన్ , ప్రోటీన్ అధికంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు, ఎదుగుతున్న పిల్లలకు ఇది చాలా మంచిది.

పిల్లల మెదడు ఆరోగ్యం కోసం చాక్లెట్లు, బిస్కెట్లు వంటి చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా పైన పేర్కొన్న సహజమైన అల్పాహారాలను ఇవ్వడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత , జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories