మామిడి కాయ ప‌చ్చ‌డి పెడుతున్నారా.? ఏడాదంతా బూజు ప‌ట్ట‌కుండా ఉండాలంటే ఇలా చేయండి

Published : May 06, 2026, 10:04 AM IST

Mango pickle: స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే ప్ర‌తీ ఇంట్లో క‌చ్చితంగా మామిడి కాయ ప‌చ్చ‌ళ్లు పెడుతుంటారు. ఏడాదంతా నిల్వ ఉండే ప‌చ్చ‌ళ్లు కొన్ని సంద‌ర్భాల్లో త్వరగా బూజు పడతాయి. అయితే ఈ స‌మ‌స్య రాకుండా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
సరైన నిల్వ డబ్బాల ఎంపిక

పచ్చళ్ల నిల్వలో ముఖ్యమైనది డబ్బా. గాలి లోపలికి వెళ్లకుండా పూర్తిగా మూసుకునే గాజు సీసాలు లేదా పింగాణీ జాడీలు ఉత్తమం. ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచితే వాసన, రుచి మారే అవకాశం ఉంటుంది. డబ్బాలు వాడే ముందు బాగా కడిగి పూర్తిగా ఎండబెట్టాలి. తేమ ఉన్నప్పుడే పచ్చడి వేస్తే త్వరగా పాడవుతుంది.

25
నూనె పరిమాణం సరిగ్గా ఉండాలి

పచ్చడిని కాపాడే ప్రధాన అంశం నూనె. పచ్చడి మీద పూర్తిగా నూనె పొర ఉండాలి. ఇది గాలి తగలకుండా కాపాడి ఫంగస్ ఏర్పడకుండా చేస్తుంది. నూనె తక్కువైతే వెంటనే పచ్చడి ఎండిపోవడం, రుచి మారడం జరుగుతుంది. అందుకే అవసరమైనంత నూనె తప్పనిసరిగా కలపాలి.

35
ఉప్పు కూడా కీల‌క‌మే

పచ్చళ్ల నిల్వలో ఉప్పు కీలకం. సరిపడా ఉప్పు లేకపోతే బ్యాక్టీరియా త్వరగా పెరిగి పచ్చడి పాడవుతుంది. ఉప్పు సహజంగా ప్రిజర్వేటివ్‌లా పని చేస్తుంది. వర్షాకాలంలో ఒకసారి పచ్చడిని చూసి ఉప్పు సరిపోతుందా లేదో పరిశీలించి అవసరమైతే కలపడం మంచిది.

45
తేమను దూరంగా ఉంచాలి

పచ్చళ్లకు ప్రధాన శత్రువు తేమ. తడి చేతులతో లేదా తడి చెంచాతో పచ్చడి తీసుకోవడం వల్ల బూజు త్వరగా వస్తుంది. ఎప్పుడూ పొడి చెంచా మాత్రమే వాడాలి. అలాగే పచ్చడి తీసుకునే సమయంలో మూత ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు. ఇలా చేస్తే గాలి, తేమ లోపలికి చేరకుండా ఉంటుంది.

55
ఎండ‌లో ఉంచ‌డం

వర్షాకాలంలో అప్పుడప్పుడు పచ్చడి జాడీలను ఎండలో పెట్టడం మంచిది. కానీ మూత తీసి పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న తేమ తగ్గి పచ్చడి ఎక్కువకాలం నిల్వ ఉండ‌దు. అదేవిధంగా పచ్చడిని మధ్య మధ్యలో కలిపి నూనె సరిగ్గా ఉన్నదో లేదో చూసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories