Watermelon: పుచ్చకాయతో బిర్యానీ మాత్రమే కాదు... ఇవి తిన్నా కూడా ప్రమాదమే..!

Published : May 06, 2026, 07:03 AM IST

 Watermelon: ఎండాకాలంలో కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాల్లో పుచ్చకాయ ముందు వరసలో ఉంటుంది. దీనిలో సుమారు 95 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.కానీ, పుచ్చకాయను కొన్ని రకాల ఫుడ్స్ తో కలిసి అస్సలు తీసుకోకూడదని మీకు తెలుసా? 

PREV
13
Watermelon

కొద్ది రోజుల క్రితం ముంబయిలో ఒక కుటుంబం బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నారు. దీని కారణంగా వీరి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత చాలా మంది పుచ్చకాయ తినడానికి కూడా భయపడుతున్నారు.

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నా.. పుచ్చకాయను సరైన సమయంలో, సరైన పరిమాణంలో, సరైన కాంబినేషన్ లో తీసుకుంటేనే ఆ ప్రయోజనాలు లభిస్తాయి.

23
పుచ్చకాయ ఎలా తినాలి?

సమ్మర్ లో మనం తీసుకునే ఆహారాలపై శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. ఈ సీజన్ లో ఆహారం తొందరగా పాడౌతుంది. కొందరు పుచ్చకాయను కోసి ఫ్రిజ్ లో పెట్టి రెండు, మూడు రోజులు తింటూ ఉంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. పుచ్చకాయలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. అందుకే కోసిన పుచ్చకాయను బయట ఉంచకూడదు. అంతేకాదు.. ఈ పండును రాత్రిపూట కూడా తినకూడదు. హెవీగా భోజనం చేసిన తర్వాత అస్సలు తినకూడదు. ఉదయం అల్పాహారం చేసిన గంట తర్వాత తినవచ్చు.

33
పుచ్చకాయతో కలిపి తీసుకోకూడని ఆహారాలు..

1.ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్...

పుచ్చకాయను ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోకూడదు. అంటే చికెన్, చేపలు, గుడ్లు, చీజ్ లాంటివి తీసుకున్నప్పుడు పుచ్చకాయ తీసుకోకూడదు. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ పుచ్చకాయ సులభంగా జీర్ణం అవుతుంది. అందువల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.

2.నీరు తాగడం...

పుచ్చకాయ తిన్న వెంటనే నీరు ఎక్కువగా తాగడం అస్సలు మంచిది కాదు. ఇది కడుపు ఉబ్బరం కలిగించడమే కాకుండా, జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. మళ్లీ అదనంగా నీరు తీసుకోవాల్సిన అవసరం లేదు.

3. పాలు , పాల ఉత్పత్తులు

పెరుగు, పాలు వంటి పాల పదార్థాలతో పుచ్చకాయను తినడం మంచిది కాదు.

ఇది కడుపులో ఆమ్లాన్ని తగ్గించి జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. దీని వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.

4. సిట్రస్ పండ్లు..

నారింజ, నిమ్మకాయ, లైమ్ వంటి పుల్లని ఫలాలతో పుచ్చకాయను కలిపి తినకూడదు.

ఇవి కలిసి తింటే జీర్ణక్రియలో ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు ఈ కలయికను తప్పించుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories