Onions: వంటకు ఉల్లిపాయలు చాలా ముఖ్యం. ప్రతిఒక్కరూ కేజీల లెక్కన ఈ ఉల్లిపాయలు కొనేస్తూ ఉంటారు. కానీ, కొన్నప్పుడు తాజాగా అనిపించినప్పటికీ, ఉల్లిపాయలు చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి. కుళ్లిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామేత వినే ఉంటారు. ఇది అక్షరాలా నిజం. ఈ ఉల్లిపాయ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. మనం కూడా దాదాపు ప్రతి వంటలోనూ ఉల్లిపాయ వాడుతూనే ఉంటాం. వంటకు రుచిని అందించడంతో పాటు.. మన శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.
వంటకు ఉపయోగించే ఇతర కూరగాయలను తక్కవ క్వాంటిటీలోనే కొనుగోలు చేస్తాం, కానీ ఉల్లిపాయలను మాత్రం కేజీల కొద్దీ ఒకేసారి కొంటూ ఉంటాం. అయితే.. వీటిని సరిగా నిల్వ చేయకపోతే తొందరగా కుళ్లిపోతాయి. నల్లగా కూడా మారతాయి.అలా జరగకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే…
23
ఎక్కడ స్టోర్ చేయాలంటే...
ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. వాటిని నీళ్లు లేని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. తేమ ఉన్న ప్రదేశంలో ఉంచితే తొందరగా కుళ్లిపోతాయి. మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఉల్లిపాయలు తేమగా ఉన్నాయి అనిపిస్తే.. వాటిని ఎండలో ఆరనివ్వాలి. ఆ తర్వాతే నిల్వ చేయాలి.
ఇక చాలా మంది మార్కెట్ నుంచి తెచ్చిన ఉల్లిపాయలను ప్లాస్టిక్ కవర్స్ లోనే ఉంచేస్తారు. ఈ పొరపాటు అస్సలు చేయకూడదు. ఉల్లిపాయలను ఎప్పుడూ గాలి తగిలేలా జాలి బుట్టలో లేదా వెదురు బుట్టలో వేయాలి. మొలకలు వచ్చినవి, కుళ్లిన వాటిని వెంటనే సపరేటు చేయాలి.
33
ఈ వస్తువుతో కలిపి ఉంచొద్దు
మీరు ఉల్లిపాయలను నిల్వ చేసేటప్పుడు, వాటిని బంగాళదుంపలతో కలిపి ఉంచకండి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే రెండింటినీ వేర్వేరుగా నిల్వ చేయాలి.