Food Storage: స‌మ్మ‌ర్‌లో ఫుడ్‌ ఎందుకు త్వ‌ర‌గా పాడ‌వుతుంది.? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి

Published : Apr 04, 2026, 12:58 PM IST

Food Storage: స‌మ్మ‌ర్‌లో ఫుడ్ త్వ‌ర‌గా పాడ‌వుతుంద‌ని తెలిసిందే. ఇంత‌కీ వేసవిలో ఆహారం ఎందుకు త్వ‌ర‌గా పాడ‌వుతుంది.? తాజాగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
14
వేసవిలో ఆహారం ఎందుకు త్వరగా పాడవుతుంది?

వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. దీని వల్ల ఆహారంలో టాక్సిన్లు ఏర్పడి అది త్వరగా పాడవుతుంది. అదే సమయంలో ఆహారంలో ఉన్న కొవ్వు పదార్థాలు కూడా వేడి కారణంగా త్వరగా చెడిపోతాయి. పాలు, పప్పులు, మాంసం వంటి ప్రోటీన్ ఉన్న పదార్థాలు మరింత త్వరగా పాడవుతాయి. తేమ ఎక్కువగా ఉంటే ఫంగస్, ఈస్ట్ కూడా త్వరగా ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

24
ఫ్రిజ్ ఉష్ణోగ్రత సరైన స్థాయిలో ఉండాలి

ఆహారాన్ని సురక్షితంగా నిల్వ చేయాలంటే ఫ్రిజ్ ఉష్ణోగ్రత చాలా ముఖ్యమైనది. ఫ్రిజ్ ఉష్ణోగ్రత 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. ఫ్రీజర్ ఉష్ణోగ్రత -18 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండాలి. ఈ ఉష్ణోగ్రతలో బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది. దీంతో ఆహారం ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది.

34
మూతపెట్టి నిల్వ చేయాలి

ఆహారాన్ని ఎప్పుడూ ఎయిర్‌టైట్ కంటైనర్లలో లేదా మూతపెట్టిన పాత్రల్లో ఉంచాలి. తెరిచి ఉంచిన పాత్రల్లో ఆహారం త్వరగా పాడవుతుంది. గాలి, తేమ, బ్యాక్టీరియా సులభంగా చేరే అవకాశం ఉంటుంది. అందుకే ప్లాస్టిక్ లేదా గ్లాస్ ఎయిర్‌టైట్ డబ్బాలు ఉపయోగించడం మంచిది. వండిన ఆహారాన్ని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. వండిన ఆహారాన్ని ఎక్కువసేపు బయట ఉంచకూడదు. వండిన 2 గంటలలోపు ఫ్రిజ్‌లో పెట్టాలి. అయితే ఫ్రిజ్‌లో పెట్టే ముందు ఆహారం కొంచెం చల్లారనివ్వాలి. అలాగే కొత్తగా వండిన ఆహారాన్ని పాత ఆహారంతో కలపకుండా వేరుగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆహారం త్వరగా పాడవకుండా ఉంటుంది.

44
కూరగాయలు, నాన్‌వెజ్ వేరుగా నిల్వ చేయాలి

వేసవిలో కూరగాయలు, పండ్లు సరిగ్గా నిల్వ చేయడం కూడా చాలా ముఖ్యం. ఆకుకూరలను కడిగి ఆరబెట్టి పేపర్ టవల్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. కోసిన పండ్లను వెంటనే తినాలి లేదా క్లోజ్డ్ బాక్సుల్లో స్టోర్ చేయాలి. ఆలుగడ్డ, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వేరుజాతి కూరగాయలను ఫ్రిజ్‌లో కాకుండా చల్లని పొడి ప్రదేశంలో ఉంచాలి. అదే విధంగా మాంసం, చేపలు, గుడ్లు వంటి నాన్‌వెజ్ పదార్థాలను వేరే కంటైనర్లలో ఉంచాలి. దీంతో ఇతర ఆహారానికి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

వీటితో పాటు తీసుకోవాల్సిన మరికొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు.. ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. ఫ్రిజ్‌ను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. ముడి ఆహారం, వండిన ఆహారం వేరుగా ఉంచాలి. ఎప్పుడూ శుభ్రమైన పాత్రలు, చెంచాలు ఉపయోగించాలి.

Read more Photos on
click me!

Recommended Stories