Cooler: ఏసీ కొనే స్థోమత లేదని ఏం బాధపడకండి.. ఈ కూలర్ ఉంటే ఏసీ కూడా అక్కర్లేదు
Cooler: సమ్మర్‌లో ఏసీ ఉంటే ఆ ఫీలింగే వేరు. అయితే చాలా మందికి ఏసీ కొనుగోలు చేసే స్థోమత ఉండదు. అలాంటి వారి కోసమే హైఫ్రెష్ అనే కూలర్ అందుబాటులో ఉంది. ఏసీకి ఏ మాత్రం తక్కువ కానీ ఈ కూలర్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

4-ఇన్-1 కూలింగ్ సిస్టమ్
HIFRESH ఎయిర్ కూలర్ ఒకేసారి ఫ్యాన్, హ్యూమిడిఫైయర్, ఎయిర్ కూలర్ లాగా పనిచేస్తుంది. అంటే గదిలోని గాలిని చల్లబరచడమే కాకుండా తేమను కూడా సరిచేస్తుంది. భారతదేశంలో వేసవిలో ఉండే వేడి, పొడి వాతావరణంకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సాధారణ ఏసీ లాగా గాలిని పొడిగా చేయకుండా, సౌకర్యంగా ఉండేలా గదిలో వాతావరణాన్ని ఉంచుతుంది.
శక్తివంతమైన కూలింగ్ – 1700 CFM గాలి ప్రవాహం
ఈ కూలర్‌లో 2026 అప్డేటెడ్ మోటార్‌తో పాటు ఎయిర్ డక్ట్ డిజైన్ ఉంది. దీనివల్ల గరిష్ఠంగా 1700 CFM గాలి ప్రవాహం వస్తుంది. గరిష్ఠంగా 31 అడుగుల దూరం వరకు గాలి చేరుతుంది. సరైన పరిస్థితుల్లో గది ఉష్ణోగ్రతను సుమారు 10–15°C వరకు తగ్గించే సామర్థ్యం ఉంది. ఇంకా చల్లదనం పెంచడానికి ట్యాంక్‌లో ఐస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. గాలి వేగం 9.5 m/s వరకు ఉంటుంది. 90° ఆటో స్వింగ్ ద్వారా గదంతా గాలి వ్యాపిస్తుంది. ఈ కూలర్ 350 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్న గదులను చల్లగా ఉంచగలదు.
4 మోడ్స్ – 4 స్పీడ్స్: మొత్తం 16 సెట్టింగ్స్
ఈ కూలర్‌లో 4 మోడ్స్, 4 స్పీడ్స్ ఉన్నాయి. వీటితో మీరు మీ అవసరానికి అనుగుణంగా గాలి తీవ్రతను మార్చుకోవచ్చు. ఇందులో నార్మల్ మోడ్, నేచురల్ మోడ్, స్లీప్ మోడ్, కూలింగ్ మోడ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఇక లో, మీడియం, హై, పవర్‌ఫుల్ వంటి 4 స్పీడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 16 రకాల సెట్టింగ్స్ లభిస్తాయి. నిద్రపోతున్నప్పుడు సైలెంట్ మోడ్‌లో ఉంచుకోవచ్చు. పగలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పవర్‌ఫుల్ స్పీడ్ ఉపయోగించుకోవచ్చు. ధర విషయానికొస్తే ఈ కూలర్ అసలు ధర రూ. 27,000 కాగా ప్రస్తుతం అమెజాన్‌లో 63 శాతం డిస్కౌంట్‌తో రూ. 9,999కి లభిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.
స్మార్ట్ ఫీచర్లు – రిమోట్, టైమర్, వాటర్ అలర్ట్
ఈ కూలర్‌లో అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. LED టచ్ కంట్రోల్ ప్యానెల్ ద్వారా సులభంగా ఆపరేట్ చేయవచ్చు. అదే విధంగా 6 మీటర్ల దూరం వరకు పనిచేసే రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది.
ఇతర ముఖ్యమైన ఫీచర్లు:
* 12 గంటల టైమర్ – ఆటో షట్‌డౌన్
* లో వాటర్ అలర్ట్ – నీరు తగ్గితే అలర్ట్ ఇస్తుంది
* నీరు పూర్తిగా అయిపోయినప్పుడు నేచురల్ మోడ్‌కి మారుతుంది.
* అల్ట్రా క్వైట్ టెక్నాలజీ – శబ్దం చాలా తక్కువ
* 30 సెకన్ల తర్వాత LED స్క్రీన్ ఆటో ఆఫ్
ఈ ఫీచర్ల వల్ల రాత్రి నిద్ర సమయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
పెద్ద ట్యాంక్, తక్కువ కరెంట్, సులభమైన మొబిలిటీ
HIFRESH కూలర్‌లో 12 లీటర్ల నీటి ట్యాంక్ ఉంది. ఇది ఒకసారి నింపితే సుమారు 24 గంటల వరకు పనిచేయగలదు. ఏసీ కంటే సుమారు 60 శాతం వరకు కరెంట్ ఆదా అవుతుంది. డిటాచబుల్ వాటర్ ట్యాంక్ ఉండడం వల్ల సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. రిమూవబుల్ కూలింగ్ ప్యాడ్ ఇచ్చారు. 4 వీల్స్ (360° వీల్స్) – సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. బిల్ట్-ఇన్ హ్యాండిల్. ఇది ఫ్రీ స్టాండింగ్ కూలర్ కావడంతో ప్రత్యేకంగా ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. ప్లగ్ పెట్టి వెంటనే ఉపయోగించవచ్చు.

