ఎలా తయారు చేయాలంటే...
వీటిని ఎలా తయారు చేయాలంటే... మిగిలిపోయిన అన్నాన్ని ఒక కప్పు తీసుకోవాలి. దానిలో ఉడికించిన రెండు బంగాళదుంపల తురుము వేయాలి. ఈ రెండిటినీ చేతులో చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. రుచి కోసం కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. ఆ రుచిని మరింత పెంచుకోవడానికి తరిగిన ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు కూడా వేయాలి. వీటిని వేయడం వల్ల పోషకాలు కూడా అందుతాయి. కారం కోసం చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసుకోవచ్చు. చివరగా పావు స్పూన్ దనియాల పొడి, మొక్క జొన్న పిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు.. సిద్ధం చేసుకున్న మిశ్రమం నుండి ఒక చిన్న ఉండను తీసుకుని, మీ అరచేతిలో పరచి, మధ్యలో మొజారెల్లా చీజ్‌ను ఉంచండి. దానిని అన్ని వైపులా మూసివేసి, ఉండ లేదా టిక్కీలా చేయండి. వేయించేటప్పుడు చీజ్ లోపల సురక్షితంగా కరిగేలా, అది బయటకు రాకుండా టిక్కీని పూర్తిగా మూసివేయాలి.