Cocktail vs Mocktail: కాక్‌టైల్- మాక్‌టైల్ మధ్య గల తేడా ఏమిటో తెలుసా?

Published : May 14, 2025, 07:53 AM IST

Cocktail vs Mocktail: మీలో చాలామంది కాక్‌టైల్- మాక్‌టైల్ లాంటి పదాలను వినే ఉంటారు. నిజానికి కాక్‌టైల్- మాక్‌టైల్‌ అనేవి వివిధ పానీయాల మిశ్రమం. అలాగే.. ఈ రెండింటినీ తయారు చేసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కాక్‌టైల్- మాక్‌టైల్ మధ్య గల తేడా ఏమిటో తెలుసుకుందాం.  

PREV
15
Cocktail vs Mocktail:  కాక్‌టైల్- మాక్‌టైల్ మధ్య గల తేడా ఏమిటో తెలుసా?
కాక్‌టెయిల్ & మాక్‌టెయిల్ తేడా ఏమిటి ?

పార్టీలలో కాక్‌టెయిల్, మాక్‌టెయిల్ లను డ్రింక్ చేస్తుంటారు. అయితే.. కాక్‌టెయిల్ అండ్ మాక్‌టెయిల్ మధ్య చాలా తేడా ఉంది. ఈ తేడా చాలా మందికి తెలియదు. కాక్‌టెయిల్ మాక్‌టెయిల్ మధ్య ఉన్న ప్రధాన తేడాలను తెలుసుకోండి.

25
ఆల్కహాల్ ఎందులో ఉంటుంది?

కాక్‌టెయిల్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల ఆల్కహాల్ (రం, వోడ్కా, జిన్ వంటివి) కలుపుతారు. మాక్‌టెయిల్ పూర్తిగా నాన్ ఆల్కహాల్. దానిలో ఎలాంటి మత్తు పదార్థాలు ఉండవు. కాబట్టి, మాక్‌టెయిల్ పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, ఆల్కహాల్‌కు దూరంగా ఉంచడమే బెటర్. 

35
మాక్‌టెయిల్ & కాక్‌టెయిల్ రెసిపీలు

కాక్‌టెయిల్ అనేది ఆల్కహాల్ కలిగిన పానీయాల సమూహం. ఆల్కహాల్, బీర్, టేకిలా మొదలైన వాటిని మిక్స్ చేయడంతో కాక్‌టైల్ డ్రింక్స్ అని అంటారు. ఇక మాక్‌టెయిల్‌లో చాలా ప్రయోగాలు చేయవచ్చు. పండ్లు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, తేనె లేదా ఏదైనా రుచిని జోడించవచ్చు.

 

45
ఏది బెటర్

కాక్‌టెయిల్ ఎక్కువగా తాగితే, మరుసటి రోజు ఉదయం 'ఇంకెప్పుడూ తాగను' అనే మూమెంట్ ఖాయం. కానీ మాక్‌టెయిల్ హెల్తీ డ్రింకే. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.

55
పాకెట్ ఫ్రెండ్లీ: మాక్‌టెయిల్ or కాక్‌టెయిల్?

ఆల్కహాల్ తో చేసే కాక్‌టెయిల్‌.. ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని ఆస్వాధించడం అందరికీ సాధ్యం కాదు. మాక్‌టెయిల్ చవకైనది, ఈజీగా ఇంట్లోనే  తయారు చేసుకోవచ్చు. మీరు బడ్జెట్‌లో పార్టీ చేసుకోవాలనుకుంటే, మాక్‌టెయిల్ బెటర్.  

Read more Photos on
click me!

Recommended Stories