Mango:షుగర్ పేషెంట్స్ కూడా మామిడిపండు తినవచ్చు, ఎలాగంటే..!

Published : May 13, 2025, 05:23 PM IST

 షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా మామిడి పండు తినవచ్చు. అంతేకాదు, అధిక బరువు పెరుగుతామనే భయం ఉన్నవారు కూడా మామిడి పండును మానేయాల్సిన అవసరం లేదు.  

PREV
16
Mango:షుగర్ పేషెంట్స్ కూడా మామిడిపండు తినవచ్చు, ఎలాగంటే..!

ఎండాకాలం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకువచ్చేది మామిడి పండే. ఈ పండును ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. కానీ, డయాబెటిక్ పేషంట్స్ మాత్రం మామిడి పండు తినకూడదు అని చెబుతుంటారు. ఎందుకంటే ఈ పండులో షుగర్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.  దీని వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయని ఇష్టం ఉన్నా తినడం మానేస్తారు. కానీ, కొన్ని సింపుల్ పద్దతులు పాటిస్తే.. షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా మామిడి పండు తినవచ్చు. అంతేకాదు, అధిక బరువు పెరుగుతామనే భయం ఉన్నవారు కూడా మామిడి పండును మానేయాల్సిన అవసరం లేదు.
 

26

షుగర్ పేషెంట్స్ మామిడి పండు తినేటప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి?

మామిడిలో సహజ చక్కెర (ఫ్రక్టోజ్) ఉంటుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఇన్సులిన్ నిరోధకత లేదా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు మామిడి తినే మోతాదును తగ్గించుకోవాలి. పోషకాహార నిపుణుల ప్రకారం.. మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలి అనుకునేవారు కూడా ఎలాంటి సందేహం లేకుండా మామిడి పండు తినవచ్చు. మామిడిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటివి ఆరోగ్యానికి మంచివి.
 

36
mango

మధుమేహం ఉన్నవాళ్ళు ఎలా తినాలి?

మామిడిని తినడానికి ముందు అరగంట నీటిలో నానబెట్టాలి. వేసవిలో రోజుకు ఒక మామిడి పండు తినడం ఆరోగ్యకరం.

1. మోతాదు: రోజుకు ఒక చిన్న ముక్క లేదా అర మామిడి పండు తినడం మంచిది. పూర్తి పండు తినకపోవడమే మంచిది.

2. ఉదయం లేదా మధ్యాహ్నం: ఉదయం లేదా మధ్యాహ్నం భోజనంతో పాటు మామిడి తింటే శరీరం గ్లూకోజ్‌ను సులభంగా గ్రహిస్తుంది. రాత్రిపూట మామిడి తినకూడదు.

3. ఖాళీ కడుపుతో తినకూడదు: భోజనం తర్వాత కాసేపు నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

46

4. గ్లైసెమిక్ ఇండెక్స్: మామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థం (50-60). కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండి మామిడి తింటే గ్లూకోజ్ స్థాయిలు పెరగవు.గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) మాత్రమే కాదు, గ్లైసెమిక్ లోడ్ (GL) కూడా ముఖ్యం. మామిడి GI మధ్యస్థంగా ఉన్నా, తిన్న పరిమాణాన్ని బట్టి గ్లూకోజ్ స్థాయి ఎలా మారుతుందో నిర్ణయించబడుతుంది. కాబట్టి చిన్న మోతాదులో మాత్రమే తినాలి.

 ఇతర ఆహారాల ప్రాధాన్యం:
మామిడి తినే రోజున ఇతర కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు, తీపి పదార్థాలు) మితంగా తీసుకోవాలి. దీనివల్ల సమతుల్య డైటు ఏర్పడుతుంది, రక్తంలో షుగర్ సడెన్‌గా పెరగదు.

56
ripen mango

ఫ్రూట్ జ్యూస్ కాకుండా ఫుల్ ఫ్రూట్ తీసుకోండి:
మామిడి రసం కాకుండా మామిడి గుజ్జు లేదా ముక్కలు తినడం ఉత్తమం. జ్యూస్‌లో ఫైబర్ పోవడంతో, అది త్వరగా చక్కెరగా మారుతుంది.ప్రతి డయాబెటిక్ వ్యక్తికి బాడీ రెస్పాన్స్ భిన్నంగా ఉంటుంది. మామిడి తిన్న తర్వాత షుగర్ లెవల్స్ ఎలా మారుతున్నాయో గ్లుకోమీటర్‌తో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. మ్యాంగో  జామ్, మ్యాంగో కేక్, మ్యాంగో ఐస్‌క్రీమ్ వంటి వాటిలో అదనంగా చక్కెర ఉండే అవకాశం ఉంటుంది. ఇవి మధుమేహం ఉన్నవారు తప్పక నివారించాలి.

 వ్యాయామం అనివార్యం:
మామిడి పండు తినే రోజుల్లో రోజూ కనీసం 30 నిమిషాల యాక్టివిటీ (వాకింగ్, యోగా, లైట్ ఎక్సర్సైజ్) చేయడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
 

66


ఇక బరువు విషయానికి వస్తే,   సరైన సమయంలో, సరైన మోతాదులో మామిడి తింటే క్యాలరీలు పెరగవు. మామిడిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. దీనివల్ల తరచుగా ఆకలి వేయదు, బరువు నియంత్రణలో ఉంటుంది.


 

Read more Photos on
click me!

Recommended Stories